Hong Kong news : అగ్నిప్రమాద స్థలంలోనే తొమ్మిది మంది మృతి చెందినట్లు ధృవీకరించగా, ఆసుపత్రికి తరలించిన మరో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో కనీసం 15 మంది గాయపడ్డారని సమాచారం. ఇంకా వందల మందికి ఆచూకీ లభించకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది హాంకాంగ్‌లో గత కొన్ని దశాబ్దాలలో జరిగిన అత్యంత ఘోర అగ్నిప్రమాదంగా చెప్పబడుతోంది.
Read also: SI scandal: సస్పెండ్ చేసిన ఎస్‌ఐపై షాకింగ్ నిజాలు
ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అనుమానంతో అరెస్ట్ చేశారు. అయితే వారి పాత్రపై పూర్తి వివరాలను పోలీస్ శాఖ వెల్లడించలేదు. (Hong Kong news) ఈ భవనాల్లో మరమ్మతుల పనులు కొనసాగుతుండగా, బయట వైపు ఏర్పాటు చేసిన బాంబూ స్కాఫోల్డింగ్ నుంచి మంటలు మొదలైనట్లు తెలుస్తోంది. గాలి వేగం మరియు మండుతున్న అవశేషాలు ఒక భవనం నుంచి మరొకటికి మంటలు వ్యాపించడానికి కారణమై ఉంటాయని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు.
స్థానికంగా నివసించే వృద్ధులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండటంతో చాలా మంది సమయానికి బయటకు రావలేకపోయారని స్థానికులు చెబుతున్నారు. మరమ్మతుల కారణంగా కిటికీలు మూసివుండటంతో కొంతమందికి అగ్నిప్రమాదం జరుగుతోందనే విషయం కూడా తెలియలేదని వారు తెలిపారు. పొరుగువారు ఫోన్ కాల్స్ చేసి హెచ్చరించడంతో కొందరు బయటపడగలిగారు.
ఈ ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న ఒక అగ్నిమాపక సిబ్బంది కూడా మృతి చెందారని అధికారులు ధృవీకరించారు. దాదాపు 900 మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, కొన్ని అంతస్తుల్లో సహాయం కోసం సంకేతాలు ఇచ్చిన వారిని చేరుకోలేకపోయామని అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డెరెక్ ఆర్మ్‌స్ట్రాంగ్ చాన్ తెలిపారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఘటనపై సంతాపం ప్రకటిస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని, భవనాల బయట వాడిన నిర్మాణ సామగ్రి పాత్రపై కూడా దృష్టి సారిస్తామని అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also :