📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య

Author Icon By Vanipushpa
Updated: February 11, 2026 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌లో మైనార్టీ వర్గాలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 12న అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో హిందువు హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మిమెన్‌సింగ్‌ జిల్లాలో సోమవారం ససేన్ చంద్రశేఖర్‌ (62) అనే హిందూ వ్యాపారి తన బియ్యం దుకాణంలో ఉన్నారు. ఇదే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆయనపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వ్యాపారి మృతిచెందడంతో దుండగులు ఎవరికీ అనుమానం రావొద్దని ఆ బట్టల షాప్‌ మూసివేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు దుకాణానికి రాగా.. అతడిని చూసి షాకైపోయారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read Also: Anil Ravipudi: కొత్త సినిమా ఊహాగానాలపై స్పందించిన దర్శకుడు

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య

వరుసగా హిందువులపై దాడులు

చంద్రశేఖర్‌ను ఆ దుండగులు ఎందుకు హత్య చేశారనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌(Bangladesh)లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో హిందూ వ్యాపారిపై హత్య చేయడం కలకలం రేపుతోంది. ఇటీవల వరుసగా హిందువులపై అక్కడ దాడులు, హత్యలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో తమకు భద్రత కల్పించాలంటూ అక్కడి హిందువులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Bangladesh crime news Bangladesh news Hindu Businessman Hindu community Minority attack Bangladesh Religious violence Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.