📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Hina Rabbani Khar: మీడియా ముందే పరువు తీసుకున్న పాక్

Author Icon By Vanipushpa
Updated: July 9, 2025 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్(Hina Rabbani Khar) అంతర్జాతీయ మీడియా(International Media)లో ఇచ్చిన ఓ లైవ్ ఇంటర్వ్యూ(Live Interview)లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. అమెరికా ఆంక్షలు విధించిన ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్‌ను ఆమె ‘సామాన్య వ్యక్తి'(Ordinary Man)గా అభివర్ణించారు. ఇంటర్వ్యూ చేస్తున్నవారి ముందే నిప్పులు చెరిగారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తుండగానే.. ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఆధారాలతో సహా నిజాలను వెల్లడించడంతో హీనా రబ్బానీ ఖార్ ముఖం చాటేశారు.

Hina Rabbani Khar: మీడియా ముందే పరువు తీసుకున్న పాక్

ఇటీవలే హీనా రబ్బానీ ఖార్ అల్ జజీరాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల ప్రార్థనలకు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నేతృత్వం వహించారు. అతడిని అమెరికా అంతర్జాతీయ టెర్రరిస్టుగా గతంలోనే ప్రకటించింది. అయితే హీనా రబ్బానీ మాత్రం ఈ అంశంపై మాట్లాడుతూ.. మీరు ఉగ్రవాది అంటూ ఆధారాల్లో చూపిస్తున్న వ్యక్తి.. మీరు అనుకుంటున్న ఉగ్రవాదని కాదన్నారు. పాకిస్థాన్‌లో కోటి మంది అబ్దుల్ రవూఫ్‌లు ఉన్నారని పేర్కొన్నారు. దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ స్పందించి.. అంత్యక్రియల సందర్భంగా విడుదల చేసిన ఫొటో ఫేక్ అని చెప్పలేదని గుర్తు చేశారు.

అమెరికా ఉగ్ర జాబితాలో ..
అంతేకాకుండా ఆ వ్యక్తి రాజకీయ పార్టీకి చెందిన వాడని, అతడి నేషనల్ ఐడీ నెంబర్‌ను కూడా విడుదల చేశారని గుర్తు చేశారు. ఆ నేషనల్ ఐడీ, అమెరికా ఉగ్ర జాబితాలో వెల్లడించిన ఐడీ ఒకటే అని హీనాకు ఆధారాలతో సహా వివరించారు. ఈ హఠాత్మపరిణామంతో అవ్వాక్కైన హీనా రబ్బానీ.. సర్దిచెప్పుకునేందుకు ప్రయత్నించారు. ఇంత జరిగినా పాక్ సైన్యం అంత్యక్రియలకు వచ్చిన రవూఫ్‌ను వెనకేసుకు వస్తూనే ఉన్నారు. కానీ అమెరికా ఆంక్షల జాబితాలోని వ్యక్తి అతడు కాదని బుకాయించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు
ఈ వివాదం ఖార్‌పైనే కాకుండా పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదులను వెనకేసుకు రావడానికి, వారికి రక్షణ కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలను బట్టబయలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఒక ఉగ్రవాది గుర్తింపును తగ్గించి చూపడానికి ఖార్ ప్రయత్నించడం, పాకిస్థాన్ సైన్యం కూడా పరోక్షంగా ఆ వ్యక్తిని సమర్థించడం, ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర చర్చకు దారితీసింది. ఇది ఉగ్రవాదం పట్ల పాకిస్థాన్ వైఖరిపై మరోసారి ప్రపంచ దేశాల సందేహాలను బలపరుస్తోంది .

రజా రబ్బానీ ఖర్ తండ్రి ఎవరు?
ఆయన 2018 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ పంజాబ్‌లోని ముజఫర్‌గఢ్ నుండి ఎన్నికయ్యారు. ఆయన ప్రసిద్ధి చెందిన ఖర్ కుటుంబానికి చెందినవారు.
హీనా నికర విలువ ఎంత?
హీనా ఖాన్: నికర విలువ నుండి విలాసవంతమైన ఆస్తులు, కారు వరకు...
నివేదికల ప్రకారం, హీనా ఖాన్ నికర విలువ దాదాపు ₹50 కోట్లు ఉంటుందని అంచనా.

#telugu News Hina Rabbani Khar Media Embarrassment Pakistan Diplomacy Pakistan news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.