📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: అమెరికాలో హై టెన్షన్..రంగంలోకి నేషనల్ గార్డులు

Author Icon By Vanipushpa
Updated: August 12, 2025 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్(Trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. వలసవాదుల విషయంలో కఠినంగా వ్యవహరించడం, అనేక దేశాలపై టారిఫ్‌లు విధించడం, అమెరికన్లకే ఉద్యోగాలు కల్పించేలా ఆదేశాలివ్వడం లాంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికా(America)లోని వాషింగ్టన్‌ డీసీ(washington dc)లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ట్రంప్ 800 మంది నేషనల్ గార్డులను మోహరించారు. అయితే ఆయన అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికాలో హై టెన్షన్..రంగంలోకి నేషనల్ గార్డులు

మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన ప్రకారం..
మరో విషయం ఏంటంటే ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో నేరాలు తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. 2024లో హింసాత్మక నేరాలు 35 శాతం తగ్గాయి. అలాగే 2025 ప్రారంభంలో దోపిడీలు 25 శాతం, హత్యలు 12 శాతం తగ్గాయి. అక్కడ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అయినప్పటికీ ట్రంప్ సైన్యాన్ని మోహరించారు. వాస్తవానికి నేషనల్ గార్డ్స్‌ను విపత్తులు వచ్చినప్పుడు లేదా పెద్దఎత్తున అల్లర్లు జరిగినప్పుడు, జాతీయ భద్రతకు సంబంధించిన పరిస్థితుల్లో మోహరిస్తారు.
బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ పేరుతో ఆందోళనలు
వాషింగ్టన్‌లో నేషనల్‌ గార్డ్స్‌ను మోహరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అక్కడ నేషనల్ గార్డ్స్‌ను మోహరించారు. 2020లో జార్జీ ఫ్లాయిడ్ హత్య తర్వాత అమెరికాలో తీవ్ర నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ పేరుతో ఈ ఆందోళనలు జరిగాయి. అప్పుడు కూడా వాషింగ్టన్‌లో ట్రంప్‌ ప్రభుత్వం వందలాది మంది నేషనల్ గార్డులను మోహరించింది.

2021 జనవరి 6న కాపిటల్ హిల్‌లో అల్లర్లు

అలాగే 2020లో నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2021 జనవరి 6న కాపిటల్ హిల్‌లో అల్లర్లు జరిగాయి. అప్పుడు కూడా భద్రత కోసం వేలాదిమంది నేషనల్ గార్డులను మోహరించారు. 1968లో మార్టిన్ లూథర్‌ కింగ్‌ జూనియర్ హత్య జరిగిన తర్వాత కూడా వీళ్లు రంగంలోకి దిగారు. సాధారణంగా పరిస్థితులు అదుపుతప్పినప్పుడు మాత్రమే నేషనల్ గార్డులను రంగంలోకి దింపుతారు. కానీ ఇప్పుడు వాషింగ్టన్‌లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నప్పటికీ వాళ్లని రంగంలోకి దింపడం చర్చనీయాంశమవుతోంది.

ట్రంప్_కుటుంబం
పిల్లలు. ట్రంప్ కు మూడు వివాహాల నుండి ఐదుగురు పిల్లలు ఉన్నారు: డాన్ జూనియర్, ఇవాంకా మరియు ఎరిక్ ట్రంప్ ఇవానా ట్రంప్ తో; టిఫనీ ట్రంప్ మార్లా మాపుల్స్ తో; మరియు బారన్ ... తో.
మెలానియా ట్రంప్
మెలానియా ట్రంప్ 2025 నుండి యునైటెడ్ స్టేట్స్ ప్రథమ మహిళగా సేవలందిస్తున్నారు, గతంలో ఆమె 2017 నుండి 2021 వరకు ఈ పదవిని నిర్వహించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/gold-prices-drop-sharply-2/business/529295/

High tension Latest News Breaking News Law and order national guard Security Alert Telugu News US Politics USA News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.