యూరప్ ఇప్పుడు ట్రాన్స్ -యూరోపియన్ ట్రాన్స్ పోర్ట్ (టెన్-టి) అనే హై-స్పీడ్ నెట్(High-speed Rail) వర్క్ కోసం సిద్ధమవుతోంది. ఇది ఖండం అంతటా ప్రజలు ప్రయాణించే విధానాన్ని మారుస్తుంది. యూరోపియన్ కమిషన్ ప్రణాళిక రైలు(train) పట్టాలకే పరిమితం కాదు. మొత్తం ప్రణాళిక రైలు, రోడ్డు, వాయు, ఓడరేవులను ఏకీకృత చట్రంలోకి అనుసంధానించడానికి ప్రయత్నిస్తుంది.
Read Also: Prime Minister Modi: పేలుడు బాధితులను పరామర్శించిన మోడీ
హై-స్పీడ్ రైలు నెట్ వర్క్ కీలకం.
కమిషన్ అనేక దేశాలను గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లతో కలుపుతోంది. అంటే ఈ రైళ్లు కేవలం నాలుగు గంటల్లోనే వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తాయి. 2040 నాటికి ఖండంలోని చాలా దేశాలమధ్య రైళ్ల వేగాన్ని దాదాపు రెట్టింపు చేయాలని యూరోపియన్ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రాజెక్టు ఖర్చు ఇంకా చర్చలోనే ఉంది
ట్రాన్స్ – యూరోపియన్(European) ట్రాన్స్ పోర్ట్ నెట్ వర్క్(network) బెర్లిన్, కోపెన్హాగన్, సోఫియా, ఏథెన్స్, పారిస్, లిస్బన్, ప్రేగ్, రోమ్ వంటి ప్రధాన యూరోపియన్ నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని గణనీయంగా వేగవంతం చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఖర్చు ఇంకా చర్చలోనే ఉంది. కానీ ఈ నెట్వర్క్ ప్రయాణికులకు చౌకైన, మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం బెర్లిన్ నుండి కోపెన్ హాగన్ కు ప్రయాణించడానికి దాదాపు 7గంటలు పడుతుండగా, ఈ కొత్త వ్యవస్థ 2030 నాటికి ప్రయాణాన్ని కేవలం 4 గంటలకు తగ్గిస్తుంది. అదేవిధంగా సోఫియా నుండి ఏథెన్స్ కు ప్రస్తుతం 14గంటలు పట్టే ప్రయాణం 2035 నాటికి 6గంటలు పడుతుంది. మీరు ప్రేగ్ నుంచి రోమ్కు ప్రయాణిస్తే ఈ అద్భుతమైన ప్రయాణం కేవలం 10గంటలకు తగ్గుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: