📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Missile Parts : అమృత్‌సర్‌లో హైఅలర్ట్‌..గాల్లోనే ధ్వంసమైన పాకిస్తాన్ మిస్సైల్

Author Icon By Shobha Rani
Updated: May 8, 2025 • 1:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్‌ అమృత్‌సర్‌లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. అమృత్‌సర్‌ పరిసరాల్లో మిస్సైల్‌ శకలాలు లభ్యం కావటం ఇప్పుడు కలకలం రేపుతోది. అమృత్‌సర్‌పై మిస్సైల్‌ దాడికి పాక్‌ ప్రయత్నించినట్టుగా సమాచారం. కానీ, భారత బలగాలు పాక్‌ చర్యలను తిప్పికొట్టాయి. పాక్‌ ప్రయోగించిన మిస్సైల్‌ను గాల్లోనే ధ్వంసం చేసింది భారతసైన్యం. యాంటీ మిస్సైల్‌ (Missile) వ్యవస్థ ద్వారా పాక్‌ దుశ్చార్యను భారత్‌ అడ్డుకుంది. ఈ క్రమంలోనే అమృత్‌సర్‌ పరిసరాల్లో కూలిపడిపోయిన మిస్సైల్‌ శకలాలను గుర్తించారు స్థానికులు.
మిస్సైల్ శకలాల కలకలం – మూడు గ్రామాల్లో అవశేషాలు
ఈ క్షిపణి ముక్కలు అమృత్‌సర్‌లోని మూడు గ్రామాల్లో పడి ఉన్నాయి. అమృత్‌సర్ గ్రామీణ ఎస్‌ఎస్‌పి మణీందర్ సింగ్ దీనిని ధృవీకరించారు. వెంటనే సైన్యానికి సమాచారం అందించారు. దాంతో ఒక సైనిక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఈ క్షిపణులను తమతో తీసుకెళ్లింది. దుధాల, జేతువాల్, పంధేర్ గ్రామాలలో క్షిపణి శకలాలు లభించాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రంతా అమృత్‌సర్‌ను చీకటి కమ్ముకుంది. మరోవైపు, పంజాబ్ పోలీసు అధికారులు, ఉద్యోగుల సెలవులు కూడా రద్దు చేశారు. భారత్‌, పాకిస్తాన్‌ ఉద్రిక్తతల నడుమ క్షణ క్షణం పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తోంది అధికార యంత్రాంగం.

Missile Parts : అమృత్‌సర్‌లో హైఅలర్ట్‌..గాల్లోనే ధ్వంసమైన పాకిస్తాన్ మిస్సైల్

ఆపరేషన్ సిందూర్ తర్వాత పంజాబ్‌లోని అనేక ప్రాంతాలలో పేలుళ్లు సంభవించినట్లు, కొన్ని తెలియని పరికరాలు పడిపోయినట్లు నివేదికలు వచ్చాయి. బటిండాలోని అకాలియా గ్రామంలోని గోధుమ తోటలో మంగళవారం రాత్రి భారీ పేలుడు సంభవించిందని. ఒకరు మృతి చెందగా, ఐదు మంది గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక్కడ ఒక యుద్ధ విమానం కూలిపోయిందని కూడా చెబుతున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రజల్లో భయాందోళన – అధికారులు అప్రమత్తం
మంగళవారం రాత్రి, తల్వారాలోని హాజీపూర్ బ్లాక్‌లోని ఘగ్వాల్ గ్రామంలోని ఒక ఇంటి ప్రాంగణంలో గీజర్ ఆకారంలో ఉన్న పరికరం పడిపోయింది. దాని నుండి అనేక వైర్లు బయటకు వచ్చాయి. అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో, ఘగ్వాల్ నివాసి అశోక్ కుమార్ (Ashok kumar) ప్రాంగణంలో ఆకాశం నుండి ఒక గుర్తు తెలియని పరికరం పడిపోయింది. దాంతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఆ వింత ఆకారంలో ఉన్న వస్తువు పడిపోయినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. అకస్మాత్తుగా వచ్చిన శబ్దం విని, అశోక్ కుటుంబ సభ్యులే కాకుండా, చుట్టుపక్కల ఇళ్లలోని వారు కూడా నిద్రలోంచి మేల్కొన్నారని చెప్పారు. వెంటనే హాజీపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ వస్తువుపై ఒక సీరియల్ నంబర్, దానిపై “టెస్ట్ పోర్ట్ సీకర్” అని ఇంగ్లీషులో రాసి ఉందని చెప్పారు.

Read Also: Operation sindoor: మూడు రాష్ట్రాల్లో బోర్డర్లు మూసివేత..కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు

Breaking News in Telugu Google news Google News in Telugu High alert in Amritsar.. Latest News in Telugu Pakistani missile destroyed in air Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.