📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Hezbollah: టాప్ కమాండర్ హతంతో .. ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా వార్నింగ్

Author Icon By Vanipushpa
Updated: November 29, 2025 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమ కమాండర్‌ను చంపినందుకు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని హెజ్బొల్లా(Hezbollah) గ్రూప్ అధినేత నయీమ్ ఖాసెమ్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో మరో యుద్ధం వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందనే భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఖాసెమ్ టెలివిజన్‌లో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఆయుధ కేంద్రాలను వదిలిపెట్టాలనే ఇజ్రాయెల్ డిమాండ్‌ను హెజ్బొల్లా ఇప్పటికే చాలాసార్లు తిరస్కరించింది. నవంబరు 23న బీరుట్ శివారుల్లో జరిగిన దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్ హైదర్ అలీ తబ్తాబాయ్ మరణించారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు దాడులు చేసిన విషయం తెలిసిందే.

 America: బైడెన్ ఆ ఆదేశాలన్నీ రద్దు చేసిన ట్రంప్

Hezbollah

కొత్త యుద్ధం వచ్చే అవకాశం

నయీమ్ ఖాసెమ్ మాట్లాడుతూ.. తమ ప్రతీకార చర్యల సమయాన్ని తామే నిర్ణయిస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ విస్తృత వైమానిక దాడులు చేస్తామనే బెదిరింపులకు తాము లొంగబోమనన్న ఆయన.. కొత్త యుద్ధం వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ‘యుద్ధాన్ని మీరు ఆశిస్తున్నారా? అయితే అది ఎప్పుడైనా సాధ్యమే. అవును, ఈ అవకాశం ఉంది, యుద్ధం రాకపోయే అవకాశం కూడా ఉంది’’ అని ఖాసెమ్ అన్నారు. ఘర్షణలపై తమ వైఖరి గురించి ఖాసెమ్ స్పష్టంగా చెప్పనప్పటికీ.. లెబనాన్ తన సైన్యం, ప్రజలపై ఆధారపడి ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోప్ లియో రాబోయే లెబనాన్ పర్యటన శాంతిని తీసుకురావడంలో, ఇజ్రాయెల్ దురాక్రమణను ముగించడంలో సహాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అటు, హెజ్బొల్లా సహా దేశంలోని ఇతర మిలిటెంట్ గ్రూపులను త్వరగా నిరాయుధులను చేయాలని లెబనాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

ఆయుధాలను వదులుకోవడానికి తాము సిద్ధంగా లేము

ఈ క్రమంలో దేశ దక్షిణ ప్రాంతంలో హెజ్బొల్లా ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి లెబనాన్ సైన్యం చేస్తున్న ప్రయత్నాలు సరిపోవని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అవిచాయ్ అడ్రీ వ్యాఖ్యానించారు. ఖాసెమ్ ప్రసంగం ముగిసిన కాసేపటికే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘హెజ్బొల్లా మోసం చేస్తూ, తమ ఆయుధాలను రహస్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది’ అని అడ్రీ ఎక్స్ (ట్విట్టర్)లో ఆరోపించారు. అయితే, ఇజ్రాయెల్ తన దాడులు, ఆక్రమణలను కొనసాగిస్తున్నంత కాలం ఆయుధాలను వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని హెజ్బొల్లా స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Conflict Google News in Telugu Hezbollah israel lebanon Middle East Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.