మధ్య అమెరికా పలు రాష్ట్రాలు ప్రకృతి విలయంతో అల్లకల్లోలంగా మారాయి. సోమవారం జరిగిన నాలుగు శక్తివంతమైన టోర్నడోలు టెక్సాస్ (Tornadoes Texas) నుంచి కెంటకీ వరకు పంజా విసిరాయి. ఈ పీడ కలిగించే గాలుల ధాటికి పలుచోట్ల భవనాలు కూలిపోయాయి.విద్యుత్ సరఫరా పూర్తిగా చిద్రమై, అనేక ప్రాంతాలు చీకట్లో మునిగిపోయాయి.ఓక్లహామా రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైంది.ఒక అగ్నిమాపక కేంద్రం సహా పది కంటే ఎక్కువ ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 1.15 లక్షల మందికి విద్యుత్ లేకుండా పోయింది.ప్రజలు చీకటిలోనే కాలం గడుపుతున్నారు. రహదారులు కూడా ధ్వంసమవడంతో, ప్రమాద నివారణ చర్యగా ట్రాఫిక్‌ను నిలిపివేశారు.ఉత్తర టెక్సాస్‌లో వడగళ్ల వాన (Hail in North Texas) తీవ్రంగా విరుచుకుపడింది. అక్కడ 11 సెంటీమీటర్లకుపైగా వ్యాసం గల వడగళ్లు పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో వాహనాలు, ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.సెయింట్ లూయిస్ నగరంలో కనీసం 5,000 భవనాలు దెబ్బతిన్నాయని అంచనా.
వందలాది కుటుంబాలు తాత్కాలిక నివాసాలకు తరలించబడ్డాయి. ఆస్తి నష్టం 1 బిలియన్ డాలర్లు దాటినట్లు అధికారులు తెలిపారు.సహాయ కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ, నష్టాన్ని పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు.కెంటకీ రాష్ట్రం టోర్నడో( Texas Tornado) ప్రభావానికి భారీగా నష్టపోయింది. ఈ ప్రకృతి విలయం కారణంగా 12 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర స్థాయిలో స్పందిస్తోంది. సహాయక బృందాలు వేగంగా పనిచేస్తున్నాయి. నష్టాన్ని అంచనా వేయడం ఇంకా కొనసాగుతోంది.మరోవైపు, వాతావరణ శాఖ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో భారీ గాలులు వస్తాయని హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నాయి.
Read Also : Shehbaz Sharif : బ్రిటిష్ రచయిత పుస్తకంలో ఆసక్తికర విషయాలు : షెహబాజ్ షరీఫ్