శుక్రవారం రాత్రి పాకిస్తాన్,(Pakistan) ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) సరిహద్దులో భారీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ వారం ప్రారంభంలో ఇరు దేశాల మధ్యనా శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో నిన్న రెండు దేశాలు ఒకరి ఒకరు కాల్పులు చేసుకున్నాయి. అయితే ఈ కాల్పులు ఎవరు మొదలుపెట్టారననది మాత్రం స్పష్టం లేదు. పాక్, ఆఫ్ఘాన్ రెండూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. కాందహార్ప్రావిన్స్‌లోని స్పిన్ బోల్డక్ ప్రాంతంలో పాకిస్తాన్ దాడులు ప్రారంభించిందని ఆఫ్ఘన్తాలిబన్ ప్రతినిధి జబీహుల్లాముజాహిద్ ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా చమన్ సరిహద్దులో “ఎటువంటి కవ్వింపు లేకుండా ఆఫ్ఘాన్ దళాలే కాల్పులకు పాల్పడిందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపించింది.
Read Also: Shamshabad Airport: ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
వాదనలను తిరస్కరించిన కాబూల్
పాకిస్తాన్ అప్రమత్తంగా ఉందని..తన ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజలను రక్షించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని పాక్ ప్రధాన మంత్రి ప్రతినిధి మోషారఫ్జైదీ అన్నారు. ఆఫ్ఘన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులు ఇటీవల తమ దేశంలో దాడులు చేశారని, వాటిలో ఆత్మాహుతి బాంబు దాడులు కూడా ఉన్నాయని పాకిస్తాన్ వాదిస్తోంది. కానీ కాబూల్ మాత్రం ఈ వాదనలను తిరస్కరించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య శాంతి చర్చలు పదేపదే విఫలమవుతున్నాయి. నెల రోజుల క్రితం తాత్కాలిక కాల్పుల విరమణకు రెండు దేశాలూ ఒప్పుకున్నాయి. అయితే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే సాగింది. ఆ సమయంలో కూడా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: