📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

త్వరలో మార్కెట్ లోకి గుండెపోటు నివారణ వ్యాక్సిన్

Author Icon By Anusha
Updated: March 14, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుండెపోటు (హార్ట్ అటాక్) చిన్నా, పెద్దా తేడా లేకుండా అందర్నీ కబళిస్తోంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలి మరణించడం, చిన్నారులకే గుండెపోటులు రావడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశంగా మారింది.ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. ఈ నేపథ్యంలో గుండెపోటును ముందుగానే అడ్డుకునే వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం సమీప దూరంలోనే ఉంది. చైనా పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ టీకా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుందని శాస్త్రీయ పరిశోధనలు నిర్ధారించాయి. నాన్‌జింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ఎలుకలపై పరీక్షించగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది.

అథెరోస్ల్కెరోసిస్

రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని అథెరోస్ల్కెరోసిస్ అంటారు . ఈ సమస్య వల్ల గుండెకు రక్తసరఫరా తగ్గిపోతుంది, ఫలితంగా స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణిస్తున్నారు.అథెరోస్ల్కెరోసిస్ నివారణలో ఈ టీకా అద్భుతంగా పనిచేసింది.ఈ నేపథ్యంలో, అథెరోస్ల్కెరోసిస్‌ను అరికట్టేందుకు చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన టీకా ఆశాజనక ఫలితాలను కనబరిచింది. ఈ వ్యాక్సిన్ ఇచ్చాక తెల్ల రక్త కణాలు క్రియాశీలమై యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి.తద్వారా రోగ నిరోధకశక్తి మెరుగుపడి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.దీని ప్రభావంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా, గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.ఈ నేపథ్యంలో అథెరోస్ల్కెరోసిస్‌కు అడ్డుకట్ట వేసేందుకు చైనా శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగంలో మెరుగైన ఫలితాలు కనిపించాయి. 

వ్యాక్సిన్

భారతదేశంలో 40-69 ఏళ్ల వయస్సు గల వ్యక్తులలో 45% మంది మరణాలకు గుండెపోటే కారణమని అధ్యయనాలు స్పష్టం చేశాయి. మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, వల్ల హార్ట్ అటాక్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.ఈ టీకా అందుబాటులోకి వస్తే:గుండెపోటు ప్రమాదాన్ని ముందుగా అరికట్టొచ్చు,స్టెంటింగ్, బైపాస్ సర్జరీల అవసరం తగ్గే అవకాశం,జీవిత కాలంలో గుండె సంబంధిత రుగ్మతల బారిన పడకుండా ఉండే అవకాశం.

ప్రస్తుతం ఈ టీకా ఎలుకలపై విజయవంతంగా పరీక్షించబడింది. తదుపరి దశలో మానవ పరీక్షలు కూడా చేపట్టనున్నారు. పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తే, దీన్ని భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.గుండెపోటు సమస్య ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ టీకా ఒక వినూత్న పరిష్కారంగా మారే అవకాశం ఉంది. దీని విజయవంతమైన వినియోగంతో భవిష్యత్ తరాలు హార్ట్ అటాక్ భయంలేకుండా జీవించగలరు.

#Atherosclerosis #CardiovascularDisease #ChinaResearch #health #HeartAttack #HeartHealth #MedicalBreakthrough #Prevention #StayHealthy #Vaccine Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.