బంగ్లాదేశ్(Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా(Hasina Case) దేశం విడిచి వచ్చిన తరువాత, ఆమెపై విధించిన ఉరిశిక్ష అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశంగా మారింది. నిరసనలను అణిచివేయమంటూ ఆదేశాలు ఇచ్చి పలువురు మరణాలకు కారణమయ్యారనే ఆరోపణలపై బంగ్లా కోర్టు ఆమెకు మరణదండన విధించింది. ఇది నేపథ్యంలో, హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారని భావిస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం, ద్వైపాక్షిక ఒప్పందాన్ని చూపిస్తూ ఆమెను వెంటనే అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తోంది. రాజకీయ ఆరోపణలున్న వ్యక్తికి ఆశ్రయం ఇవ్వకూడదన్న నిబంధనలను ప్రస్తావిస్తూ, హసీనాను తిరిగి పంపాలని అక్కడి అధికారులు హెచ్చరికలు కూడా చేస్తున్నారు.
Telemetry Issue: కృష్ణా పర్యవేక్షణలో నిలకడపై ప్రశ్నలు
న్యాయపరమైన దృక్కోణంలో భారత్‌కు ఉన్న అధికారం
అయితే, భారత న్యాయ నిపుణుల అభిప్రాయాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. వారి ప్రకారం, ఇండియా–బంగ్లాదేశ్ ఎక్స్‌ట్రడిషన్ ఒప్పందంలోని ఆర్టికల్ 8 మరియు ఆర్టికల్ 29 ప్రకారం, రాజకీయ ప్రేరేపిత కేసులు, న్యాయ ప్రక్రియలో లోపాలు ఉన్న అభ్యర్థనలు, లేదా హ్యూమన్ రైట్స్‌కు విరుద్ధంగా ఉండే పరిస్థితులు ఉన్నపుడు భారత్‌కు ఆ అభ్యర్థనను తిరస్కరించే పూర్తి అధికారం ఉంది. బంగ్లాదేశ్‌లో ఈ కేసు రాజకీయ ప్రతీకారంగా నమోదైందనే అభిప్రాయం, విచారణ పారదర్శకతపై సందేహాలు, మరియు హసీనాకు(Hasina Case) నిష్పక్షపాతమైన రక్షణ లభించే అవకాశాలు తక్కువగా ఉండటం. ఈ అన్ని అంశాలు కలిపి చూస్తే, బంగ్లాదేశ్ అభ్యర్థనను భారత్ తిరస్కరించే పూర్తి న్యాయాధికారం ఉందని నిపుణులు చెబుతున్నారు.
భారత్ నిర్ణయం ఎలా ఉండవచ్చు?
నిపుణుల విశ్లేషణ ప్రకారం, హసీనాను అప్పగించడం భారత్‌కు రాజకీయంగా కూడా సున్నితమైన విషయం. ఈ అభ్యర్థనను అంగీకరించడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల అంశాలు, ప్రాంతీయ రాజకీయ సమతౌల్యం, మరియు దేశాల మధ్య భవిష్యత్తు సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల, భారత్ ఈ కేసును రాజకీయ కేసుగా పరిగణించి, ఒప్పందంలో ఉన్న ప్రత్యేక నిబంధనలను ఉపయోగించి హసీనాను అప్పగించకపోవడం పూర్తిగా చట్టబద్ధమేనని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/