ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన హర్యానా యువకుడు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న బ్రిటిష్ (British) పోలీసులు ఉన్నత విద్య కోసం యూకే వెళ్లిన హర్యానా యువకుడు అక్కడ ఘోర హత్యకు గురయ్యాడు. ఈ నెల 25న జరిగిన దాడిలో అతడిపై కత్తులతో దుండగులు ఎటాక్ చేయగా, తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబం మరియు అక్కడి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read also: US:కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం: బర్త్‌డే వేడుకలో నలుగురు మృతి
Indian student brutally murdered in UK
విజయ్‌పై కత్తులతో దాడి
హర్యానాలోని విజయ్ కుమార్ షియోరాన్ (30) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌లో పనిచేస్తూ, ఉన్నత చదువుల లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలి ఈ ఏడాది ప్రారంభంలో యూకేకు వెళ్లాడు. వోర్ స్టర్ ప్రాంతంలో ఈ నెల 25న గుర్తు తెలియని వ్యక్తులు విజయ్‌పై కత్తులతో దాడి చేశారు. స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించినా, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ విజయ్ మృతి చెందాడు.
ఘటన తరువాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగులపై దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. విజయ్ మరణ వార్తతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. విజయ్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని విదేశాంగ శాఖ, హర్యానా ముఖ్యమంత్రిని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: