📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Harvard – ట్రంప్ కు బిగ్ షాక్.. హార్వర్డ్ కు నిధులు ఇవ్వాల్సిందే: కోర్టు ఆదేశం

Author Icon By Digital
Updated: September 4, 2025 • 4:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ట్రంప్ కు బిక్ షాక్ తగిలింది. హార్వర్డ్(Harvard) నిధుల విషయంలో ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కోర్టులో చుక్కెదురైంది. హార్వర్డ్ యూనివర్శిటీకి అందించే 2.6 బిలియన్ డాలర్ల నిధుల నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఫెడర్ కోర్టు(Feder’s Court) ఆదేశించింది.

హార్వర్డ్ తన పాలన విధానాల్లో మార్పు కోసం వైట్ హౌస్ చేసిన డిమాండ్లను తిరస్కరించినందుకు ట్రంప్(Trump)సర్కార్ తీసుకున్న ప్రతీకార చర్య అని తీర్పునిచ్చింది. వర్సిటీలో యూదులపై వ్యతిరేకత విషయానికి ఈ నిధుల కోతకు సంబంధం లేదని పేర్కొంది. ఫెడరల్ నిధులను నిలిపివేయడాన్ని సమర్థించేందుకు యూదులపై వ్యతిరేకతను కవచంగా వాడారని తెలిపింది. ఇది స్పష్టమైన రాజకీయ ప్రతీకారమని వెల్లడించింది.

ఈ తీర్పుతో హార్వర్డ్కు గణనీయమైన విజయం లభించింది. కోతల కారణంగా నిలిచిన వందలాది రీసెర్చ్ ప్రాజెకులకు పునర్జీవం లభించనుంది.

కఠిన నిబంధనలు

హార్వర్డ్ వర్శిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని, ఫేస్ మాస్క్ లను నిషేధించాలని ట్రంప్ పాలనావిభాగం ఓ లేఖను పంపించింది. పాలస్తీనా అనుకూల నిరసనలను అణచివేసేందుకు ఈ నిబంధనలను జారీ చేసినట్లుగా సమాచారం.

దీనిపై స్పందించిన హార్వర్డ్(Harvard) యూనివర్సిటీ అధ్యక్షుడు అలాన్ గార్బర్ ఆ డిమాండ్లను వ్యతిరేకిస్తున్నట్లు బదులిచ్చారు. పౌర హక్కులను ఉల్లంఘించారనే ఇప్పటికే కొలంబియా, పెన్సిల్వేనియాతో సహా కార్నెల్, నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయాలకు అందించే నిధులను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది.

ట్రంప్ నిర్ణయాలపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వ్యక్తం అవుతున్న వేళ కోర్టులు కూడా షాకింగ్ తీర్పులిస్తుండడం విశేషం.

హార్వర్డ్ ఏ దేశంలో ఉంది?

హార్వర్డ్ విశ్వవిద్యాలయం యునైటెడ్ స్టేట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లోని అగ్రశ్రేణి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఒకటి.

Read Hindi news: Hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/america-america-is-in-turmoil-due-to-economic-recession/international/541065/

America Harvard harvard news latest harvard news today harvard news trump Harvard University international news Tump

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.