📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Latest Telugu News: Hamas: ప్రియురాలిని చంపిన హమాస్..ఇజ్రాయెల్ యువకుడి ఆత్మహత్య

Author Icon By Vanipushpa
Updated: October 13, 2025 • 1:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హమాస్(Hamas) ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం నుంచి ప్రాణాలతో బయటపడ్డా, ఆనాటి భయానక జ్ఞాపకాలతో రెండేళ్లుగా నరకం అనుభవించిన ఓ యువకుడు చివరకు తనువు చాలించాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌(Israel)లోని నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై జరిగిన దాడిలో తన ప్రియురాలిని, ప్రాణ స్నేహితుడిని కళ్ల ముందే కోల్పోయిన రోయి షలేవ్ (30) తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్నాడు.

Gaza: ఎట్టకేలకు ఏడుగురు బందీలను విడుదల చేసిన హమాస్

ప్రియురాలిని చంపిన హమాస్..ఇజ్రాయెల్ యువకుడి ఆత్మహత్య

స్నేహితుడిని కళ్ల ముందే కోల్పోయిన రోయి షలేవ్

టెల్ అవీవ్‌లో కాలిపోయిన కారులో రోయి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. మరణానికి కొన్ని గంటల ముందు, అతను సోషల్ మీడియాలో ఒక హృదయ విదారక సందేశాన్ని పోస్ట్ చేశాడు. “దయచేసి నన్ను చూసి కోపగించుకోవద్దు. నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు. నా లోపల ఉన్న ఈ బాధ ముగిసిపోవాలని మాత్రమే కోరుకుంటున్నాను. నేను బతికే ఉన్నాను, కానీ నా లోపల అంతా చచ్చిపోయింది” అని అందులో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ చూసిన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెతకడం ప్రారంభించేలోపే జరగరానిది జరిగిపోయింది. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం, అతను చివరిసారిగా ఒక పెట్రోల్ డబ్బా కొనుగోలు చేస్తూ కనిపించాడు.

చనిపోయినట్లు నటించినా ఉగ్రవాదుల కాల్పులు

రెండేళ్ల క్రితం నోవా ఫెస్టివల్‌పై హమాస్ మిలిటెంట్లు విరుచుకుపడినప్పుడు, రోయి షలేవ్ తన ప్రియురాలు మపాల్ ఆడమ్, స్నేహితుడు హిల్లీ సోలమన్‌తో కలిసి ఒక కారు కింద దాక్కునే ప్రయత్నం చేశాడు. తన ప్రియురాలిని కాపాడేందుకు ఆమెపై పడుకున్నాడు. గంటలపాటు చనిపోయినట్లు నటించినా, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరూ గాయపడ్డారు. ఆ ఘటనలో మపాల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటనపై మపాల్ సోదరి మయాన్ స్పందిస్తూ “రోయిని అక్టోబర్ 7నే హత్య చేశారు, కానీ అతను నిన్న చనిపోయాడు. ఈ బాధను వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

హమాస్ చరిత్ర ఏమిటి?
1987లో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా జరిగిన మొదటి ఇంతిఫాదా సమయంలో హమాస్ స్థాపించబడింది మరియు దాని మూలాలు ఈజిప్టు ముస్లిం బ్రదర్‌హుడ్ ఉద్యమంలో ఉన్నాయి, ఇది 1950ల నుండి గాజా స్ట్రిప్‌లో చురుకుగా ఉంది మరియు మసీదులు మరియు వివిధ స్వచ్ఛంద మరియు సామాజిక సంస్థల నెట్‌వర్క్ ద్వారా ప్రభావాన్ని పొందింది.
హమాస్ ఎవరి నియంత్రణలో ఉంది?
హమాస్ పరిపాలనను మొదట ఇస్మాయిల్ హనియే జూన్ 2007 నుండి ఫిబ్రవరి 2017 వరకు; తరువాత యాహ్యా సిన్వార్ అక్టోబర్ 2024లో హత్యకు గురయ్యే వరకు; తరువాత మహమ్మద్ సిన్వార్ మే 2025లో హత్యకు గురయ్యే వరకు; మరియు అప్పటి నుండి ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ నాయకత్వం వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

#telugu News content="Hamas Gaza Conflict Hamas terrorism israel Israeli suicide Latest News Breaking News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.