Mohammed Sinwar killed : పాలస్తీనా సాయుధ సంస్థ Hamas తన సాయుధ విభాగమైన అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ తరఫున కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్–గాజా యుద్ధంలో తమ సాయుధ విభాగం ప్రతినిధిగా ప్రసిద్ధి చెందిన Abu Obeida మృతి చెందినట్లు అధికారికంగా ధ్రువీకరించింది. అలాగే గాజాలో హమాస్ మాజీ నాయకుడిగా ఉన్న Mohammed Sinwar కూడా ఈ ఏడాది ప్రారంభంలోనే మరణించారని వెల్లడించింది.
సోమవారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్, తమ దీర్ఘకాల ప్రతినిధి మరణాన్ని నిర్ధారిస్తూ, కొత్త ముసుగు ధరించిన ప్రతినిధిని నియమించినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా అబూ ఒబైదా అసలు పేరు హుదైఫా సమీర్ అబ్దుల్లా అల్-కహ్లౌట్ అని తొలిసారిగా వెల్లడించారు. “మా మహానేత అబూ ఒబైదా వీరమరణాన్ని గర్వంగా ప్రకటిస్తున్నాం. ఆయన పేరును, పాత్రను మేమే కొనసాగిస్తాం,” అని కొత్త ప్రతినిధి తెలిపారు.
ఇజ్రాయెల్ సైన్యం మే నెలలోనే మొహమ్మద్ సిన్వార్‌ను (Mohammed Sinwar killed) హతమార్చినట్లు ప్రకటించగా, మూడు నెలల తర్వాత అబూ ఒబైదా కూడా మరణించాడని తెలిపింది. అబూ ఒబైదా గాజాలో హమాస్ తరఫున కీలక స్వరంగా వ్యవహరించారు. యుద్ధ పరిణామాలు, కాల్పుల విరమణ ఉల్లంఘనలు, ఖైదీల మార్పిడి వంటి అంశాలపై ఆయన తరచుగా ప్రకటనలు విడుదల చేసేవారు. సెప్టెంబర్ ప్రారంభంలో గాజా సిటీపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరమైన సమయంలో ఆయన చివరి ప్రకటన వెలువడింది.
Read also: EC: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు
అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ ప్రకటనలో మరికొందరు ఉన్నత స్థాయి కమాండర్లు కూడా మరణించినట్లు తెలిపింది. రఫా బ్రిగేడ్ అధిపతి మొహమ్మద్ షబానా, హకమ్ అల్-ఇస్సా, రాయెద్ సాద్ వంటి నేతలు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. వీరితో పాటు హమాస్ అగ్ర రాజకీయ, సైనిక నాయకులు ఇప్పటికే మరణించారని వెల్లడించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణపై కూడా కొత్త ప్రతినిధి స్పందించారు. ఇజ్రాయెల్ పదేపదే ఉల్లంఘనలు చేస్తోందని ఆరోపిస్తూ, ఆక్రమణ కొనసాగుతున్నంత కాలం ఆయుధాలు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని ఇజ్రాయెల్ ఒప్పందాలను పాటించేలా ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: