📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: HAL: రష్యాతో భారత్ మరో కీలక ఒప్పందం

Author Icon By Aanusha
Updated: October 29, 2025 • 9:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత వైమానిక రంగం చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే ఘట్టం ప్రారంభం కానుంది. దేశంలో తొలిసారిగా పూర్తిస్థాయి ప్రయాణికుల విమానాల తయారీకి రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు భారత్‌లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లు మాత్రమే ఉత్పత్తి అవుతుండగా, ఇప్పుడు వాణిజ్య ప్రయాణికుల విమానాల తయారీకి కూడా మార్గం సుగమమైంది. రష్యాకు చెందిన ప్రముఖ సంస్థ యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (United Aircraft Corporation – UAC), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కలిసి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నాయి.

Read Also:  Influencers: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చైనా కఠిన నిబంధనలు

ఈ మేరకు హెచ్ఏఎల్ (HAL) ఒక ప్రకటన చేసింది. ఇండియాలో పూర్తి స్థాయి ప్రయాణికుల విమానాన్ని తయారు చేయనుండటం ఇదే తొలిసారి అని తెలిపారు. పౌర విమానాయన రంగంలో భారత్ ఆత్మనిర్భరత సాధించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారనుంది అంటున్నారు.ఈ మేరకు హెచ్ఏఎల్ విడుదల చేసిన ప్రకటనలో ఇలా చెప్పుకొచ్చింది.

HAL

దేశంలో పూర్తిస్థాయిలో ప్రయాణికుల విమానం తయారు చేయనుండటం ఇదే ప్రథమం. గతంలో అనగా 1961లో ఇండియాలో హెచ్ఎస్-748 విమానాలను తయారు చేశారు. ఆ ప్రాజెక్ట్ సుమారు 27 సంవత్సరాల కన్నా ఎక్కువ కొనసాగింది. 1988లో ప్రాజెక్ట్ ముగిసింది. దాని తర్వాత మళ్లీ ఈ తరహా ప్రాజెక్ట్ చేపట్టడం ఇదే ప్రథమం అని తెలిపారు.

సమీపంలోని అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలకు

వచ్చే పది సంవత్సరాలలో స్థానిక కనెక్టివిటీ పెంచడం కోసం చిన్న పరిమాణ కలిగిన ఎస్‌జే-100 వంటి విమానాలు 200 వరకు అవసరం అవుతాయి. వీటితో పాటుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచడానికి, సమీపంలోని అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలకు సేవ చేయడానికి అదనంగా 350 విమానాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

పౌర విమానయాన రంగంలో భారత్ ఆత్మనిర్భరత సాధించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారుతుందని.. హెచ్ఏఎల్ ఒక ప్రకటనలో తేలింది.

యూఏసీ వెబ్‌సైట్ ప్రకారం, ఎస్‌ఎస్‌జే-100 విమానం చిన్న పరిమాణంలో, 103 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఉంటుంది. ఇది సుమారు 3,530 కిలోమీటర్ల పరిధిలోని స్వల్ప దూర ప్రయాణాలకు అత్యంత అనుకూలమైనది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 16 విమానయాన సంస్థలు 200కు పైగా ఎస్‌ఎస్‌జే-100 విమానాలను నడుపుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Breaking News HAL india aviation latest news passenger aircraft manufacturing SSJ-100 Telugu News UAC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.