📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Saudi Airlines: హజ్ యాత్రికుల విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

Author Icon By Shobha Rani
Updated: June 16, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హజ్ యాత్రికులతో (Hajj pilgrims) లఖ్‌నవూ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సౌదీ అరేబియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. 250 మంది హజ్‌ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరిన సౌదీ ఎయిర్‌లైన్స్‌ (Saudi Airlines) విమానం ఆదివారం ఉదయం లఖ్‌నవూలోని అమౌసి విమానాశ్రయంలో దిగింది. ఆ తర్వాత.. టాక్సీ మార్గంలో వెళుతుండగా విమానం ఎడమ టైర్ నుంచి నిప్పురవ్వలు, దట్టమైన పొగలు వచ్చినట్లు విమానాశ్రయం అధికారులు సోమవారం వెల్లడించారు. వెంటనే, అప్రమత్తమైన పైలట్‌ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందించడంతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పారని తెలిపారు. అనంతరం ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎడమ చక్రం నుంచి మంటలు
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌(Saudi Airlines) కు చెందిన విమానం SV 3112 శనివారం రాత్రి 11:30 గంటలకు సౌదీలోని జెడ్డా విమానాశ్రయం నుంచి 250 మంది హజ్ యాత్రికులతో బయలుదేరింది. ఆదివారం ఉదయం 6:30 గంటలకు లఖ్‌నవూలోని అమౌసి విమానాశ్రయానికి చేరుకుంది. రన్‌వేపై దిగిన తర్వాత, విమానం టాక్సీవే పైకి వస్తుండగా దాని ఎడమ చక్రం నుంచి మంటలు, పొగ రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందించాడు.

Saudi Airlines: హజ్ యాత్రికుల విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం

అత్యవసర చర్యలు – సిబ్బంది శ్రమ ఫలించింది
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు దాదాపు 20 నిమిషాలు శ్రమించి మంటలను ఆర్పారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించినట్లు అధికారులు పేర్కొన్నారు. సాంకేతికలోపం కారణంగా విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ చక్రం పనిచేయకపోవడంతో మంటలు వచ్చాయని తెలిపారు.
హజ్ యాత్రికులకు కలిగిన దడ
250 మంది హజ్ యాత్రికులు జెడ్డా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులంతా ప్రార్థనలు చేసుకుంటూ భయాందోళనలో ఉన్నారు, కానీ సిబ్బంది సత్వర చర్య వల్ల ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన ద్వారా మరోసారి పైలట్‌ శాంతస్వభావం, సిబ్బంది అప్రమత్తత, అత్యవసర సేవల సమయోచిత స్పందన వల్ల పెనుప్రమాదం తప్పింది. హజ్ యాత్రికులు సురక్షితంగా బయటపడడం ఆనందదాయకమైన విషయం. అయినప్పటికీ, విమానాల్లో సాంకేతిక లోపాలపై నిరంతర సమీక్ష అవసరం ఉందని విమాన ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Mohsin Rezai: ఇజ్రాయెల్‌పై అణుబాంబు వర్షం కురిపిస్తాం: ఇరాన్‌

#telugu News Breaking News in Telugu flight narrowly misses accident Google news Google News in Telugu Hajj pilgrims' Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.