📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Hafiz Saeed: పహల్గాం దాడి వెనుక హఫీజ్‌ సయీద్‌ హస్తంపై పలు అనుమానాలకు తావు!

Author Icon By Vanipushpa
Updated: April 25, 2025 • 1:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోగల బైసరన్‌ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్‌ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏకంగా 26 మందిని పొట్టనపెట్టుకున్న ఆ దాడిని ప్రత్యక్షంగా చూసిన బాధితులు ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. అయితే ఈ క్రూరమైన దాడి వెనుక ‘లష్కర్‌ ఎ తోయిబా’ చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. హఫీజ్‌ సయీద్‌తోపాటు అతడి ముఖ్య అనుచరుడు సైఫుల్లా ఉగ్రవాదులను అమాయకుల మీద ఊసిగొల్పారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

హఫీజ్ సయీద్ పాత్రపై నిఘా వర్గాల అనుమానం
లష్కర్‌ ఎ తోయిబాకు అనుబంధంగా ఉండే కరుడుగట్టిన ఉగ్రవాదుల బృందం మంగళవారం బైసరన్‌లో నిర్దాక్షిణ్యంగా 26 మంది అమాయకులను మట్టుపెట్టింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆ బృందంలో ప్రధానంగా విదేశీ ఉగ్రవాదులు ఉంటారు. ఆ ఉగ్రవాదులకు స్థానిక ఉగ్రవాదులతోపాటు కశ్మీర్‌లో మద్దతుదారులు కొందరు సహకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముంబైలో 26/11 దాడికి కారకుడైన హఫీజ్ సయీద్ సాయం
ముంబైలో 26/11 దాడికి కారకుడైన హఫీజ్ సయీద్ ఈ దాడిలో పాల్గొన్న టెరరిస్టులకు కూడా అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడికి పాల్పడిన బృందం చాలాకాలంగా కశ్మీర్‌ లోయలో క్రియాశీలకంగా ఉన్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది సోనామార్గ్, బూతాపత్రీ, గండేర్బల్ దాడుల్లో ఈ బృందమే పాలుపంచుకున్నట్లు తెలిసింది. గత అక్టోబర్‌లో బూతాపత్రిలో జరిగిన దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు సహా మొత్తం నలుగురు మృతి చెందారు.
అయితే, గత డిసెంబర్‌లో ఈ టెరరిస్టు బృందానికి చెందిన జునైద్ అహ్మద్ భట్ అనే లష్కర్‌ ఎ తోయిబా ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మిగిలిన వారు ఎలాగోలా తప్పించుకుని సమీప అడవుల్లోకి పారిపోయారు.

Read Also: Pahalgam Terror Attack : లష్కరే టాప్‌ కమాండర్‌ అల్తాఫ్ లల్లీ హతం!

#telugu News Breaking News in Telugu Google News in Telugu Hafiz Saeed's hand behind the Pahalgam attack is a source of many suspicions! Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.