ఇటీవల కాలంలో సైబర్ మోసాలు(Cyber frauds) విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు మన ఫోన్లను ట్యాప్ చేస్తారో తెలియదు, హ్యాకింగ్ చేస్తారో కూడా తెలియదు. మనమెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంటున్నాయి. తాజాగా న్యూయార్లో కూడి ఇలాంటి సంఘటనే జరిగింది. న్యూయార్క్ లో మొబైల్ హ్యాకింగ్ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 150మంది ప్రపంచనేతలు పాల్గొనే సమావేశాన్ని టార్గెట్ చేశారు. మొబైల్ హ్యాకింగ్ ద్వారా సమావేశానికి ఆటంకం కలిగించడమే కాకుండా..నేతల ఫోన్లనూ ట్యాప్ చేసే కుట్ర పన్నారు. అయితే ఐరాస సమావేశానికి కొద్ది సేపటి ముందే దీన్ని యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ గుర్తించింది. భారీ రహస్య టెలికాం నెట్ వర్క్న పూర్తిగా తొలగించింది.
సీక్రెట్ నెట్ వర్న ఏర్పాటు ఐరాస సర్వసభ్య సమావేశంతో న్యూయార్క్ నగరం సందడిగా మారింది. అక్కడ హోటళ్లన్నీ ప్రపంచాధినేతలతో నిండిపోయాయి. వీరందరినీ కూడా హ్యాకర్లు టార్గెట్ చేశారని సీక్రెట్ సర్వీసెస్ అధికారులు చెబుతున్నారు. మౌలిక లక్ష్యాలను బ్లాక్(Block) చేయడం ద్వారా ఇబ్బందులను గురిచేయాలని భావించారని చెప్పారు.
సీనియర్ ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని టెలికమ్యూనికేషన్ బెదిరింపులపై సీక్రెట్ సర్వీస్ చేపట్టిన విస్తృత దర్యాప్తులో భాగంగా ఈ నెట్ వర్క్ బయటపడిందని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా అధికారులు అప్రమత్తమైన యూఎస్ అధికారులు సీక్రెట్ సర్వీస్ సర్వీసెస్ గుర్తించి, ఆ నెట్ వర్క్ ను పూర్తిగా తొలగించడంతో పెద్ద ఉపద్రవం నుంచి బయటపడినట్లుగా అయింది.
ఐరాస (UN) ఏ సమస్యను ఎదుర్కొంటోంది?
ఐరాసకు కూడా హ్యాకింగ్ దాడుల వల్ల సైబర్ భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి.
ఈ హ్యాకింగ్ ఎక్కడ జరిగింది?
న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయం సైబర్ దాడులకు గురైనట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: