📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: H-1B వీసా కష్టమా? ఇండియన్స్‌కి ఈ దేశాలు డోర్ ఓపెన్ చేస్తున్నాయి

Author Icon By Vanipushpa
Updated: August 28, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో మంచి కెరీర్‌ కోసం వెతికే భారతీయ(Indian) టెకీలు, ప్రొఫెషనల్స్‌కి ఎప్పటి నుంచో H-1B వీసానే పెద్ద డ్రీమ్. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రభుత్వం కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలను తీసుకొస్తూ, H-1B వీసాను పరిమితం చేయడం లేదా నిలిపివేయడం గురించి ఆలోచిస్తోంది. దీంతో వేలాది మంది భారతీయులు ఇప్పుడు అమెరికా కాకుండా ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రంప్ మొదటి టర్మ్‌లోనే H-1B వీసాలపై పరిమితులు పెట్టడానికి ప్రయత్నించారు. అవుట్‌సోర్సింగ్ కంపెనీలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నాయి, అమెరికన్ వర్కర్స్‌కి అవకాశాలు తగ్గుతున్నాయి అని ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

H-1B వీసా కష్టమా? ఇండియన్స్‌కి ఈ దేశాలు డోర్ ఓపెన్ చేస్తున్నాయి

అనేక దేశాలు తలుపులు తెరుస్తున్నాయి

ఇప్పుడు రెండో టర్మ్‌లో ఇంకా కఠినమైన చర్యలు ప్రతిపాదిస్తున్నారు. వీసా(Visa) వ్యవధి తగ్గించడం, బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ కఠినతరం చేయడం, అమెరికా ఆర్థిక వ్యవస్థలో విదేశీ వర్కర్లపై ఆధారాన్ని తగ్గించడం వంటి చర్యలు చర్చలో ఉన్నాయి. భవిష్యత్తులో H-1B దారులు కొంచెం కష్టమవుతాయన్న మాట. అయితే, H-1B వీసా ఒకటే మార్గం కాదు. నిజానికి, భారతీయు(Indians)ల కోసం ఇప్పుడు అనేక దేశాలు తలుపులు తెరుస్తున్నాయి.

  1. కెనడా
    ఇది అమెరికాకు అత్యంత దగ్గర ఎంపిక అని చెప్పొచ్చు. కెనడా గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (GTS) ప్రోగ్రామ్ ద్వారా IT, ఇంజనీరింగ్, సైన్స్ రంగాల ప్రొఫెషనల్స్‌కి కేవలం రెండు వారాల్లోనే వర్క్ పర్మిట్ ఇస్తుంది. అది కాకుండా Express Entry అనే పాయింట్స్ ఆధారిత సిస్టమ్ ద్వారా శాశ్వత నివాసం (PR) పొందొచ్చు. ముఖ్యంగా, జాబ్ ఆఫర్ లేకుండానే అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
  2. ఆస్ట్రేలియా
    ఈ దేశం స్కిల్డ్ మైగ్రేషన్ పథకాలలో ముందుంటుంది. Subclass 189, 190, 482 వంటి వీసాలు IT, హెల్త్‌కేర్, ఇంజనీరింగ్ రంగాల వారికి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, ఇవి H-1B లాంటివి లాటరీ సిస్టమ్ కాదు. క్లీన్ ప్రాసెస్ ఉంటుంది. జాబ్ ఇచ్చే కంపెనీ సపోర్ట్ లేకపోయినా, అక్కడ సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
  3. జర్మనీ మరియు యూరప్ దేశాలు
    జర్మనీ మరియు యూరప్ దేశాలు కూడా మంచి ఆప్షన్. జర్మనీలో EU Blue Card చాలా ప్రాచుర్యం పొందింది. ఒక ఫిక్స్‌డ్ సాలరీ లెవల్ చేరుకుంటే రెసిడెన్సీ లభిస్తుంది. అదికాకుండా జాబ్ సీకర్ వీసా ద్వారా ఆరు నెలలు అక్కడ ఉండి ఉద్యోగం వెతికే అవకాశం ఉంటుంది. జర్మనీతో పాటు మాల్టా, లక్సెంబర్గ్ వంటి యూరప్ దేశాలు కూడా IT, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్‌కు తలుపులు తెరుస్తున్నాయి.
  4. మిడిల్ ఈస్ట్ & ఆసియా:
    మిడిల్ ఈస్ట్ & ఆసియా వైపు చూస్తే, UAEలో Green Visa, Golden Visa ప్రోగ్రామ్‌లు ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్స్, ఫ్రీలాన్సర్స్ కోసం చాలా ప్రాచుర్యం పొందాయి. దీర్ఘకాలిక రెసిడెన్సీ, వేగవంతమైన ప్రాసెసింగ్, లాంగ్వేజ్ టెస్ట్ అవసరం లేకపోవడం వీటి ప్రత్యేకత. అలాగే సింగపూర్ ఎంప్లాయిమెంట్ పాస్ కూడా IT, ఇంజనీరింగ్ రంగాల్లో అత్యంత డిమాండ్‌లో ఉంది.
  5. న్యూజిలాండ్
    అక్కడ ‘స్కిల్డ్ మైగ్రెంట్ వీసా’ పాయింట్స్ ఆధారంగా ఇస్తారు. IT, హెల్త్‌కేర్ రంగాల్లో శాశ్వత నివాసం పొందే మార్గం ఉంది. మరో వైపు, అనేక దేశాలు ఇప్పుడు రిమోట్ వర్క్ వీసాలు అందిస్తున్నాయి. దీని ద్వారా మనం మన దేశంలో ఉండి గ్లోబల్ కంపెనీల కోసం పని చేసే అవకాశం లభిస్తుంది. శాశ్వతంగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ దేశాలు H-1B కంటే ఎందుకు మెరుగ్గా కనిపిస్తున్నాయి? మొదటగా, ఇవి లాటరీ సిస్టమ్ కావు. ఎక్కువగా మెరిట్ బేస్డ్. మీ స్కిల్స్, క్వాలిఫికేషన్‌కి ప్రాధాన్యం ఉంటుంది. రెండోది, ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది.

H B1 వీసా స్థితి అంటే ఏమిటి?
H-1B వీసా స్థితి అనేది USలో ప్రత్యేక వృత్తులలో ఉన్న విదేశీ కార్మికులకు తాత్కాలిక స్థితి, దీనికి ప్రత్యేక జ్ఞానం మరియు బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత అవసరం. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీ ఉద్యోగిని US యజమాని స్పాన్సర్ చేయాలి మరియు డిమాండ్ పరిమితిని మించి ఉంటే అది వార్షిక పరిమితి మరియు లాటరీ వ్యవస్థకు లోబడి ఉంటుంది.

H-1B కి ఎవరు అర్హులు?
USA H1B వీసా అవసరాలు - అగాక్స్ ప్రైవేట్ లిమిటెడ్
H-1B వీసాకు అర్హత సాధించడానికి, మీకు US యజమాని నుండి "స్పెషాలిటీ వృత్తి" కోసం చెల్లుబాటు అయ్యే ఉద్యోగ ఆఫర్ అవసరం, దీనికి ఉపాధి రంగంలో కనీసం US బ్యాచిలర్ డిగ్రీ (లేదా దాని విదేశీ సమానమైనది) అవసరం.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/trump-nobel-peace-prize-lobbying/international/537131/

Global Opportunities H1B visa Immigration Indians Abroad Jobs Overseas Latest News Breaking News Skilled Workers Telugu News work visa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.