ఇప్పటివరకు అమెరికా వెళ్లాలనుకునే వారికి అదృష్టమే కీలకంగా ఉండేది. H-1B వీసాల(H1B Visa) కోసం లక్షలాది దరఖాస్తులు వస్తే, కంప్యూటర్ లాటరీ ద్వారా ఎంపిక చేసి వీసాలు మంజూరు చేసేవారు. స్కిల్స్ స్థాయి, జీతం ఎంత అన్న అంశాలు పెద్దగా పరిగణనలోకి రాకపోవడంతో, తక్కువ నైపుణ్యాలు ఉన్నవారికీ అవకాశాలు దక్కేవి. అయితే దీనివల్ల నిజమైన టాప్ టాలెంట్‌కు అన్యాయం జరుగుతోందని అమెరికా ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో లాటరీ విధానానికి ముగింపు పలుకుతూ, ప్రతిభ ఆధారిత ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read also: Raitu Bharosa scheme : రైతు భరోసాలో కీలక మార్పులు.. సీఎం రేవంత్ నిర్ణయం!
ఇకపై జీతమే కీలకం – హై ప్యాకేజ్ ఉన్నవారికే అవకాశం
H1B Visa” కొత్త విధానంలో ఒకే వీసాకు పలువురు అప్లై చేస్తే, ఎవరికైతే అధిక జీతం ఆఫర్ చేస్తారో వారికి ప్రాధాన్యం లభిస్తుంది. అంటే హై లెవల్ స్కిల్స్‌తో పాటు భారీ సాలరీ ప్యాకేజ్ తప్పనిసరి. తక్కువ జీతంతో అమెరికా వెళ్లే అవకాశాలు దాదాపు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇది ముఖ్యంగా భారత ఐటీ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఎందుకంటే భారత్ నుంచి అమెరికా వెళ్లే చాలా మంది కంపారేటివ్‌గా తక్కువ జీతాలతోనే ఆన్‌సైట్ అవకాశాలు పొందుతున్నారు. ఇకపై కంపెనీలు భారతీయులను అమెరికాకు పంపాలంటే తప్పనిసరిగా ఎక్కువ ప్యాకేజీలు ఆఫర్ చేయాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రభావం – ఐటీ రంగానికి సవాల్
ఈ మార్పులతో అక్రమాలకు కూడా చెక్ పడనుంది. గతంలో కొన్ని కంపెనీలు ఒకే అభ్యర్థి పేరుతో అనేక దరఖాస్తులు చేసి లాటరీలో గెలిచే ప్రయత్నాలు చేసేవి. వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్ వల్ల ఇలాంటి మోసాలకు అవకాశం ఉండదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, ఒక్కో వీసాకు ప్రభుత్వ ఫీజు భారీగా ఉండటంతో సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అమెరికా కల మరింత దూరమవుతోంది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత ఐటీ సంస్థలు తమ రిక్రూట్‌మెంట్ విధానాలు, ఆన్‌సైట్ స్ట్రాటజీలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
లాటరీ విధానం పూర్తిగా రద్దయ్యిందా?
అవును, H-1B వీసాల కోసం లాటరీ విధానానికి ముగింపు పలికారు.
కొత్త విధానంలో ఏది ప్రధాన ప్రమాణం?
అధిక జీతం మరియు ఉన్నత నైపుణ్యాలే కీలకంగా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: