H1b visa update : H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు, కొత్త లాటరీ రూల్స్!

Read Time:  1 min
H1b visa update
H1b visa update
FONT SIZE
GET APP

H1b visa update : అమెరికాలో ఉద్యోగాలు ఆశించే విదేశీ నిపుణులకు హెచ్-1బి వీసా ప్రక్రియలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. US Citizenship and Immigration Services (USCIS) 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే ఈసారి నిబంధనలు మరింత కఠినంగా మారడంతో అభ్యర్థులు, కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రిజిస్ట్రేషన్లు మార్చి 4, 2026 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై, మార్చి 19తో ముగియనున్నాయి. లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తారు. ఎంపికైనవారే ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయి వీసా పిటిషన్లు దాఖలు చేయడానికి అర్హులు.

Read Also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

H1b visa update
H1b visa update

కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం, కొన్ని హై-స్కిల్డ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అదనంగా 1,00,000 డాలర్ల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సుమారు రూ.83 లక్షలకు సమానం. ముఖ్యంగా అమెరికా వెలుపల నుంచి దరఖాస్తు చేసేవారికి ఈ భారం తప్పదు. అలాగే ప్రాథమిక రిజిస్ట్రేషన్ ఫీజును 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు. ఈ నిర్ణయాలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల భాగంగా అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఉన్న రాండమ్ లాటరీ విధానానికి బదులుగా ఈసారి ‘వెయిటేజ్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎక్కువ జీతం ఆఫర్ చేసే కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా నైపుణ్యం గల అభ్యర్థులకు అవకాశం కల్పించాలనేది లక్ష్యం. అయితే భారీ ఫీజుల కారణంగా చిన్న కంపెనీలు, స్టార్టప్‌లు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఐటీ సంస్థలు చెబుతున్నాయి.

ఈ మార్పులపై అమెరికాలోని పలు వ్యాపార సంస్థలు కోర్టును ఆశ్రయించినప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే అమల్లో కొనసాగుతున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.