📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

H-1B: హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

Author Icon By Vanipushpa
Updated: December 26, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో కంపెనీలు విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వం వారికి హెచ్1బీ (H-1B)వీసాలు జారీ చేస్తోంది. వీటికి భారత్, చైనా వంటి దేశాల్లో గట్టి పోటీ ఉంది. తాజాగా అమెరికాలో ట్రంప్ సర్కార్ హెచ్1బీ వీసాల వల్ల విదేశీ నిపుణులు స్థానికుల ఉద్యోగాల్ని దొంగిలిస్తున్నారనే ఆరోపణలతో వీటి జారీలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఉన్న లాటరీ విధానం స్ధానంలో కొత్తగా వేతనాల ఆధారిత హెచ్1 వీసాల జారీ విధానం తీసుకొచ్చింది. అమెరికా కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్1బీ వీసాలు కొత్తగా పొందాలంటే ప్రతీ ఒక్కరికీ లక్ష డాలర్ల చొప్పున ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన తెచ్చాక తాజాగా లాటరీ విధానం స్ధానంలో వేతనాల ఆధారిత వీసాల జారీ విధానాన్ని కూడా అమల్లోకి తెస్తున్నట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఎక్కువ నైపుణ్యం, అధిక వేతనాలు పొందే దరఖాస్తుదారులకు హెచ్-1బీ వీసాలు కేటాయించే అవకాశం ఉంటుంది.

Read Also: December 26: ‘బాక్సింగ్ డే’ పేరెలా వచ్చిందంటే?

Visa

రాండమ్ లాటరీ ద్వారా వీసాలు

హెచ్-1బీ వీసా ఎంపిక విధానంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి ప్రకారం, ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ల తర్వాత రాండమ్ లాటరీ ద్వారా వీసాలను కేటాయిస్తున్నారు. ఏడాదికి 85వేల వీసాల కోటా (65,000 సాధారణ వీసాలు మరియు ఉన్నత విద్యావంతులకు 20,000 అదనపు వీసాలు) ఉన్నప్పటికీ.. దరఖాస్తుల కోటా పెరిగిపోవడంతో ఇలా లాటరీ ద్వారా కేటాయిస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఇకపై హెచ్1బీ వీసాలను కేవలం లాటరీ అదృష్టం ఆధారంగా కాకుండా, అమెరికా కార్మిక విభాగం (DOL) నిర్దేశించిన వేతన స్థాయిల ఆధారంగా కేటాయిస్తారు. దీంతో అధిక జీతం పొందేవారికి వీసా లభించే అవకాశాలు పెరుగుతాయి. 2027 ఆర్ధిక సంవత్సరం హెచ్1బీ క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్‌కు ముందు.. 2026 ఫిబ్రవరి 27 నుండి ఇది అమలులోకి వస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Breaking News in Telugu H1B visa Indian IT Workers New Policy Skilled Professionals Telugu News online Today news US Immigration Visa Updates work visa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.