అమెరికాకు ఉద్యోగాల కోసం వచ్చే విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్1బీ వీసా(H1-B)ల విషయంలో ట్రంప్ సర్కార్ మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అమెరికన్లను ఉద్యోగాలు కల్పించే సాకుతో హెచ్1బీ వీసాలు ఇచ్చే కంపెనీలపై ఏడాదికి ఒక్కో ఉద్యోగిపై లక్ష డాలర్ల ఫీజు విధిస్తున్న ట్రంప్.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో హెచ్1బీ వీసాదారులకు మరింత చుక్కలు కనిపించడం ఖాయంగా తెలుస్తోంది. హెచ్1బీ వీసా దరఖాస్తుదారులపై ఇప్పటికే అమెరికాలో ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఈ వీసాలు ఇవ్వాలంటే దరఖాస్తుదారుల గత చరిత్ర, సోషల్ మీడియా అకౌంట్ల చరిత్రల్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు వాటి పరిధిని మరింతగా విస్తరిస్తోంది.
Read Also: Israel: అరెస్టు కు భయపడను.. న్యూయార్క్ పర్యటనపై నెతన్యాహు
గోప్యత మరింత కష్టంగా మారబోతోంది
అలాగే తమ సోషల్ మీడియా ఖాతాల సెట్టింగ్స్ ను సైతం ప్రైవసీ నుంచి పబ్లిక్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇకపై హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారి గోప్యత మరింత కష్టంగా మారబోతోంది. హెచ్1బీ వీసాలతో పాటు హెచ్4 వీసా దరఖాస్తుదారుల రెజ్యూమ్స్ తో పాటు వారి లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ ను కూడా చెక్ చేయాలని అమెరికా దౌత్య కార్యాలయాలకు ట్రంప్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.
హెచ్1బీ వీసాలకు సోషల్ మీడియా వెట్టింగ్
జాతీయ భద్రత పరిరక్షణలో భాగంగా వీరి సమాచారాన్ని స్కాన్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా హెచ్1బీ వీసాలకు సోషల్ మీడియా వెట్టింగ్ కొనసాగుతోంది. ఈ వీసాలకు దరఖాస్తు చేసుకునేవారి గత చరిత్రను పరిశీలించి ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా తిరస్కరిస్తున్నారు. ప్రభుత్వం పైకి చెబుతున్న నిబంధనల కంటే ఎక్కువగా అధికారులు క్షేత్రస్దాయిలో ఆంక్షలు విధిస్తూ దరఖాస్తులు తిరస్కరిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: