H1B visa news : అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ షాక్ తగిలింది. హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టారు. ‘ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్స్ యాక్ట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు, అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు చేసి హెచ్-1బీ వీసా విధానాన్ని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
అమెరికా పౌరుల ఉద్యోగాలు, సంక్షేమం కన్నా విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని గ్రెగ్ స్టూబ్ వాదిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు తక్కువ జీతాలకు విదేశీ కార్మికులను నియమించి, అమెరికా యువతకు రావాల్సిన ఉద్యోగాలను దూరం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అమెరికన్ డ్రీమ్‌ను కాపాడాలంటే ఈ విధానాన్ని అడ్డుకోవాల్సిందేనని పేర్కొన్నారు.
Read Also: House : వామ్మో.. 500 ఎకరాల్లో ఇల్లు.. ఎక్కడుందో తెలుసా?
ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే, అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారతీయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం హెచ్-1బీ వీసాలు పొందుతున్న వారిలో 80 శాతానికి పైగా భారతీయులు, చైనీయులే కావడం గమనార్హం. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం ఈ వీసాకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసింది. కొత్త హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్ల భారీ ఫీజు విధించడంతో పాటు, లాటరీ విధానానికి బదులుగా అధిక వేతన ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇవ్వనుంది. తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు వీసా అవకాశాలు తగ్గనున్నాయి. ఈ నిబంధనలు ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసా రద్దు బిల్లు ప్రవేశపెట్టడం భారతీయ ఐటీ నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: