అమెరికాలో (America) శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కలలు కనే భారతీయులకు మరోసారి నిరాశ కలిగింది. యూఎస్ డైవర్సిటీ వీసా (H1B Visa) లాటరీ (Diversity Visa Lottery) — లేదా గ్రీన్ కార్డ్ లాటరీగా పిలిచే ఈ కార్యక్రమంలో, భారతీయులు కనీసం 2028 వరకు పాల్గొనే అర్హత కోల్పోయారు.
Read also: NCTE: టీచర్లకు షాక్… TET మినహాయింపుపై NCTE నో
H1B Visa: ఇండియన్స్‌కు అమెరికా కొత్త షాక్ – మూడేళ్లు నో వీసా!
కారణం ఏమిటి?
అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం వలసదారుల్లో వైవిధ్యాన్ని పెంచడం కోసం డైవర్సిటీ వీసా లాటరీని నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ప్రకారం, గత ఐదేళ్లలో 50,000 మందికి పైగా వలసదారులు పంపిన దేశాలు లాటరీకి అర్హులు కావు. భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్తున్న వారి సంఖ్య ఈ పరిమితిని చాలా కాలంగా మించిపోతోంది. అమెరికా గణాంకాల ప్రకారం
- 2021లో 93,000 మందికి పైగా,
- 2022లో 1.27 లక్షల మంది,
- 2023లో 78,000 మందికి పైగా భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు.
ఈ సంఖ్యల కారణంగా, భారత్ (india) ఈ వీసా లాటరీ అర్హత జాబితా నుండి ఆటోమేటిక్‌గా తప్పించబడింది. భారతదేశంతో పాటు చైనా, పాకిస్థాన్, దక్షిణ కొరియా, కెనడా వంటి దేశాలు కూడా ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. భారతీయులకు మిగిలిన ప్రత్యామ్నాయ మార్గాలు డైవర్సిటీ లాటరీ రహదారి మూసుకుపోయినా, అమెరికా శాశ్వత నివాసం పొందేందుకు కొన్ని మార్గాలు ఇంకా అందుబాటులో ఉన్నాయి:
H-1B వర్క్ వీసా ద్వారా — ఉద్యోగ ఆధారిత వలస దరఖాస్తు చేసుకోవడం.
ఫ్యామిలీ స్పాన్సర్‌షిప్ ద్వారా — అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యుల ద్వారా దరఖాస్తు.
EB-5 ఇన్వెస్ట్‌మెంట్ వీసా ద్వారా — పెట్టుబడి పెట్టి గ్రీన్ కార్డ్ సాధించడం.
అయితే, అమెరికా ప్రభుత్వం ఇటీవల వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఫలితంగా, ఈ మార్గాల ద్వారా కూడా వీసా (H1B Visa) లేదా గ్రీన్ కార్డ్ పొందడం కష్టతరమవుతోంది. భారతీయులలో అమెరికాలో స్థిరపడాలనే కలలు కొనసాగుతున్నా — ఈ లాటరీ మినహాయింపు 2028 వరకు కొనసాగవచ్చని తాజా సమాచారం చెబుతోంది.
అమెరికా డైవర్సిటీ వీసా లాటరీ అంటే ఏమిటి?
ఇది అమెరికాలో వలసదారుల వైవిధ్యాన్ని పెంచేందుకు ప్రతి సంవత్సరం నిర్వహించే లాటరీ ప్రోగ్రామ్.
భారతీయులు ఎందుకు అర్హులు కావడం లేదు?
గత ఐదేళ్లలో భారత్ నుంచి 50,000 మందికి పైగా వలస వెళ్ళడం వల్ల, అమెరికా నిబంధనల ప్రకారం భారత్ అర్హత కోల్పోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: