📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: H-1B Visa: హెచ్ 1బీ హోల్డర్లు ఎక్కడకీ వెళ్ళకండి..

Author Icon By Vanipushpa
Updated: October 8, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America) లో హెచ్ 1బీ రూల్స్ (H-1B Visa) ను కఠినతరం చేసేసింది ట్రంప్ గవర్నమెంట్. దీని ఫీజును లక్ష డాలర్లకు పెంచేసింది. ఇది చాలా ప్రకంపనలనే సృష్టించింది. దీని కారణంగా చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్చరికలను జారీ చేసింది. చాలా మంది ప్రయాణాలు ఆపేసుకున్నారు. ఆల్రెడీ స్వదేశాలకు వెళ్ళిన వారు వెంటనే తిరిగి వెనక్కు వచ్చేశారు. అయితే తరువాత ఈ లక్ష డాలర్ల ఫీజు కొత్తగా హెచ్ 1బీ వీసా(H-1B Visa) అప్లై చేసుకునే వారికి మాత్రమే వైట్ హౌస్ క్లారిఫై చేసింది. దీంతో పరిస్థితి కాస్త నెమ్మదించింది.

Nobel prize : భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

తాము చెప్పే వరకూ ఎక్కడకీ వెళ్ళకండి..

కానీ కాలిఫోర్నియా యూనివర్శిటీ మాత్రం ఇంకా తమ అద్యాపకులను, సిబ్బందిని ఎక్కడికీ వెళ్ళొద్దని చెబుతోంది. ఎటువంటి అంతర్జాతీయ ప్రయాణాలను పెట్టుకోవద్దని హెచ్చరించింది. ప్రస్తుతం హెచ్ 1బీ వీసాలపై అనిశ్చితి ఉందని..అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిదని అంటోంది. యూనివర్శిటీలో దీనికి సంబంధించిన ప్రకటనను జారీ చేసింది. మళ్ళీ తాము చెప్పే వరకూ ఎవరూ కదలొద్దని గట్టిగా చెప్పింది యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్. ప్రస్తుతం అమెరికా బయట ఉన్న హెచ్ 1బీ వీసాదారులు కూడా వెంటనే వెనక్కు తిరిగి రావాలని ఆదేశించింది. గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఎటువంటి కొత్త ప్రకటనా రాకముందే వారందరూ వెనక్కు తిరిగి రావాలని చెప్పింది. ఇప్పటి వరకు టెక్ కంపెనీల మాత్రమే హెచ్ 1బీ వీసాల విషయంలో ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు కాలిఫోర్నియా యూనివర్శిటీ ఈ రకమైన ప్రకటన చేసి మొదటగా నిలిచింది.

H-1B Visa: హెచ్ 1బీ హోల్డర్లు ఎక్కడకీ వెళ్ళకండి..

16 వేల మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిన ఓ కంపెనీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) H1B వీసా వార్షిక రుసమును లక్ష డాలర్లకు (రూ. 88 లక్షలకు పైగా) పెంచారు. ట్రంప్ ఇలా సడెన్‌గా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో అనేదానిపై చాలానే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. చాలావరకు అమెరికన్ కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగించి వాళ్ల స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయని తెలిపింది. అమెరికా వనరులు, ఉద్యోగాలపై ముందుగా అమెరికన్లకే హక్కు ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు ట్రంప్ చెబుతూ వస్తున్నారు. దీనికి కారణం కంపెనీల్లో ఉన్న అమెరికన్లను తొలగించి…విదేశీయలును నియమించుకోవడమే అని చెబుతోంది వైట్ హౌస్. తాజాగా ఓ కంపెనీ 16 వేల మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించింది. ఆ కంపెనీ 5,189 H1బీ పర్మిషన్లు పొందింది. 1698 వీసా పర్మిషన్లను పొందిన మరో కంపెనీ 2400 ఉద్యోగాలను తగ్గించింది.

ఫిబ్రవరిలో 1000 అమెరికన్ ఉద్యోగులకు లేఆఫ్

ఇంకో కంపెనీ 25,075 H1B వీసా(h1-b-visa) అనుమతులు పొందింది. 2022 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 27 వేల మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో కంపెనీ 1137 H1బీ వీసాలు పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1000 అమెరికన్ ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చింది. అమెరికన్ ఐటీ ఉద్యోగులకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇలా ఉద్యోగంలో నుంచి తొలగించడం, అలాగే విదేశీ టెక్కీలకు శిక్షణ ఇవ్వడంపై విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌1బీ వీసా ఫీజును పెంచినట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

H1B visa holders immigration policy international travel alert non-immigrant visas Telugu News travel warning US Immigration USCIS updates visa issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.