📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

H 1B Visa : హెచ్-1బీ వీసాలపై భారతీయ అమెరికన్ షాకింగ్ పోస్టు..

Author Icon By Divya Vani M
Updated: May 17, 2025 • 6:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో వలస విధానాలు ఎప్పుడూ చర్చకు హాట్ టాపిక్. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులపై ఆంక్షలు మరింత కఠినంగా మారాయి. హెచ్-1బీ వీసా నుంచి విద్యార్థి వీసాల వరకూ ప్రతి దశలో కొత్త నియమాలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో వీసాల రద్దులు సాధారణంగా మారాయి. అమెరికా వలస పాలసీలపై ఇప్పుడు మరో ఆసక్తికర చర్చ నెట్టింట జరుగుతోంది.ఒరెగాన్‌లో నివసిస్తున్న భారతీయ మూలాలున్న అమెరికన్ రోహిత్ జాయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా చర్చనీయాంశంగా మారింది. “హెచ్-1బీ వీసా పూర్తిగా రద్దు చేయాలి” అనే ఆయన వ్యాఖ్యలు నెటిజన్లను షాక్‌కి గురి చేశాయి.అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్‌కార్మిక్ ఇటీవల H 1B Visa రెన్యువల్ వ్యవస్థను మెరుగుపరిచేలా సలహాలు ఇచ్చారు. ఆయన ప్రకారం, ఈ విధానం ఖర్చు తగ్గించి దేశ ఉత్పాదకత పెంచడంలో సహాయపడుతుంది. దీనిపై ఆయన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియోకి లేఖ కూడా రాశారు.

H 1B Visa హెచ్ 1బీ వీసాలపై భారతీయ అమెరికన్ షాకింగ్ పోస్టు..

2024లో ప్రారంభమైన డొమెస్టిక్ వీసా రిన్యూవల్ ప్రోగ్రామ్‌ను ఇంకా మెరుగుపరచాలని సూచించారు.అయితే దీనిపై రోహిత్ స్పందన చాలా ఘాటుగా ఉండటం విశేషం. “హెచ్-1బీ వీసా అవసరం లేదు, పూర్తిగా రద్దు చేయాలి,” అంటూ ఆయన స్పష్టంగా చెప్పారు. విదేశీ వర్కర్లు అమెరికా అభివృద్ధికి అడ్డుకట్టవుతారని, దేశ పోటీతత్వానికి నష్టం చేస్తారని అభిప్రాయపడ్డారు.అతను అమెరికాలో పుట్టినప్పటికీ తనకు భారతీయ మూలాలున్నాయని గుర్తు చేస్తూ చేసిన ఈ కామెంట్ నెట్టింట చిచ్చుపెట్టింది. కొంతమంది రోహిత్‌కు మద్దతుగా నిలవగా, మరికొంతమంది ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారు. “ఇలాంటి వ్యాఖ్యల వల్ల వలసదారులకు నష్టం జరుగుతుంది,” అంటూ కొందరు పేర్కొన్నారు.ఒక యూజర్ కూడా స్పందిస్తూ, “నిన్ను స్వదేశానికి పంపిస్తారు,” అంటూ హెచ్చరించగా, రోహిత్ స్పందన: “నేను అమెరికా పౌరుడిని” అంటూ సమాధానమిచ్చాడు. అయితే, అతను ఎంత అమెరికా మద్దతుగా మాట్లాడినా, స్థానికుల నుండి పూర్తి మద్దతు దొరకడం కష్టమేనని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.ఈ వివాదం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. వీసా విధానాలపై ప్రజల్లో మిశ్రమ అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కొందరు వలసదారుల అవసరాన్ని గుర్తిస్తున్నా, మరికొందరు సుమారు అదే ఉత్సాహంతో వ్యతిరేకిస్తున్నారు. ఈ ట్వీట్ కొత్త చర్చకు తెరతీసినట్టైంది.

Read Also : Turkey :తుర్కియే కంపెనీ చెలేబీ లైసెన్స్‌ రద్దు చేసిన భారత్

H1B visa H1B Visa Cancellation Indian American Rohit Joy Trump Immigration Rules US Immigration Policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.