H-1B visa news : అమెరికా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంతో H-1B, H-4 వీసా దరఖాస్తుదారులు మరో పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ 15 నుంచి అన్ని H-1B ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు మరియు ఆధారిత పిల్లలకు సోషల్ మీడియా స్క్రీనింగ్ తప్పనిసరి చేయడంతో, అమెరికా కాన్సులేట్లలో ఇప్పటికే షెడ్యూల్ అయిన అనేక వీసా ఇంటర్వ్యూలు రద్దయ్యాయి.
ఇమ్మిగ్రేషన్ న్యాయవాదుల ప్రకారం, డిసెంబర్ మధ్య నుంచి చివరి వరకూ ఉన్న అపాయింట్‌మెంట్లు భారీగా క్యాన్సిల్ అయ్యాయి. హైదరాబాద్, చెన్నైలోని యూఎస్ కాన్సులేట్లలో కూడా ఇంటర్వ్యూలు నెలల పాటు వాయిదా పడ్డాయి. చాలా మందికి ఇప్పుడు మార్చి 2026 వరకు కొత్త అపాయింట్‌మెంట్లు ఇచ్చారు.
ఈ నిర్ణయం వల్ల కొత్త ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారు, పెళ్లిళ్లు లేదా కుటుంబ అవసరాల కోసం భారత్‌కు వచ్చిన వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇప్పటికే అమెరికాకు తిరిగి వెళ్లలేని పరిస్థితుల్లో నిలిచిపోయారు. సోషల్ మీడియా అకౌంట్లన్నింటినీ “పబ్లిక్”లో ఉంచాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది.
Read also: Election Inducement: ఎన్నికల నియమాలు ఉల్లంఘన: డబ్బుల పంపిణీపై అభ్యర్థుల దృష్టి
కాన్సులేట్లలో రోజుకు తక్కువ మంది ( H-1B visa news) దరఖాస్తుదార్లనే ఇంటర్వ్యూ చేయనున్నందువల్లే ఈ రద్దులు జరుగుతున్నాయని న్యాయవాదులు తెలిపారు. అధికారికంగా వీసా ప్రక్రియ నిలిపివేయలేదు అయినా, నెలల తరబడి అపాయింట్‌మెంట్లు వాయిదా పడటంతో పరిస్థితి ఫ్రీజ్‌లా మారిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక విదేశీ ప్రయాణాలు అత్యవసరమైతే తప్ప మానుకోవాలని ఇమ్మిగ్రేషన్ లా ఫర్ములు హెచ్చరిస్తున్నాయి. సోషల్ మీడియాలో చేసిన పాత పోస్టుల ఆధారంగా అమెరికాలో ఉన్న కొందరి వీసాలు కూడా రద్దు చేసిన కేసులు బయటకు వస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: