📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

New York Shooting : న్యూయార్క్‌లో కాల్పుల మోత … ముగ్గురు మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు

Author Icon By Divya Vani M
Updated: August 17, 2025 • 7:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా మళ్లీ కాల్పుల దృశ్యానికి వేదిక అయింది. ఈసారి ఘటన చోటు చేసుకున్న ప్రదేశం న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ (Brooklyn, New York). ఆదివారం తెల్లవారుజామున స్థానికంగా ఉన్న ఓ నైట్‌క్లబ్‌లో దుండగులు అర్ధరాత్రి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘోర ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ దాడి క్రౌన్ హైట్స్ ప్రాంతంలోని ఫ్రాంక్లిన్ అవెన్యూలో ఉన్న ‘టేస్ట్ ఆఫ్ ది సిటీ’ (‘Taste of the City’) లాంజ్‌లో జరిగింది. కాల్పుల ఘటన తెల్లవారుజామున 3:27 గంటల ప్రాంతంలో ప్రారంభమైందని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. సంఘటనపై సమాచారం అందిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.ప్రాథమికంగా లభించిన సమాచారం ప్రకారం, ఒక చిన్న మాటామాటా దాడికి దారితీసింది. అది క్రమేణా ఉద్రిక్తతకు దారి తీసి కాల్పుల రూపంలో మారింది. పోలీసులు ఘటనాస్థలాన్ని జల్లెడ పడుతూ 36 బుల్లెట్ షెల్స్‌తో పాటు ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

బాధితుల్లో ముగ్గురు మృతి, ఎనిమిది మందికి గాయాలు

ఈ కాల్పుల్లో మొత్తం 11 మంది బాధితులుగా గుర్తించారు. వీరిలో ఎనిమిది మంది పురుషులు కాగా, ముగ్గురు మహిళలు ఉన్నారు. వయస్సు 27 నుంచి 61 సంవత్సరాల మధ్యగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మృతులంతా పురుషులే అని స్పష్టం చేశారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేరని డాక్టర్లు తెలిపారు.ఈ ఘటనపై న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ స్పందించారు. “ఇది ఎంతో దారుణమైన ఘటన. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తాం. నిందితులను త్వరగా గుర్తించి చర్యలు తీసుకుంటాం,” అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. నిందితుల కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది.

స‌మీపంలో భ‌ద్ర‌తా ఏర్పాట్లు క‌ఠినం

పోలీసులు ఘటనాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఫోరెన్సిక్ విచారణ చేపట్టారు. తీరా ఇటీవ‌లే వర్జీనియాలో కూడా కాల్పుల ఘటన చోటు చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. అక్కడ ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు.ఈ తరహా ఘటనలు అమెరికాలో సాధారణంగా మారిపోతున్నాయి. నైట్‌క్లబ్‌లు, స్కూల్స్, పబ్లిక్ ప్లేసుల్లో ఇలాంటి ఘటనలు రోజు రోజుకీ పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇక అమెరికా గన్ కల్చర్‌పై విమర్శలు మరింత తీవ్రమవుతున్నాయి.

Read Also :

https://vaartha.com/heavy-rain-alert-telangana-3-days-red-alert/telangana/531563/

American gun culture Brooklyn attack news Brooklyn nightclub attack New York shooting incident News Telugu Shootings in America

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.