📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gulf War: గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లుపై దాడికి యత్నం

Author Icon By Vanipushpa
Updated: March 9, 2026 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల అసలు బలహీనత ఏంటో బయటపడింది. ఇంతకాలం ఈ దేశాలపై దాడి చేయాలంటే వాటి ప్రధాన ఆదాయ వనరు అయిన చమురుపై దాడి చేస్తే దెబ్బకొట్టవచ్చని అంతా భావించారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే చమురు కంటే వారి పెద్ద బలహీనత తాగునీరే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యుద్ధంలో గల్ప్ (Gulf) దేశాల్లోని డీసాలినేషన్ ప్లాంట్లు దెబ్బతింటే భారీ మానవ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

Read Also: War in West Asia: పశ్చిమాసియాలో యుద్ధం.. భారీగా పెరిగిన చమురు ధరలు

Gulf War: Attempted attack on drinking water plants in Gulf countries

గల్ప్ దేశాల్లో తాగునీటి వనరులు చాలా తక్కువ

నదులు, పెద్ద సరస్సులు లేనందున అక్కడి నగరాలు సముద్రపు నీటిలోని ఉప్పు, ఇతర ఖనిజాలను తొలగించి తాగునీటిగా మార్చుకుంటాయి. ఈ పద్ధతిని రివర్స్ ఒస్మోసిస్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో నీటిని ప్రత్యేక మెంబ్రేన్ ఫిల్టర్ల ద్వారా పంపించి ఉప్పును వేరుచేస్తారు. ఈ విధంగా శుద్ధి చేసిన నీటిని ఇళ్లకు, పరిశ్రమలకు, హోటళ్లకు సరఫరా చేస్తారు. గల్ఫ్ ప్రాంతంలోని చాలా దేశాలకు నదులు, సరస్సులు వంటి తాగునీటి వనరులు లేవు. అందుకే డీసాలివేషన్ ప్లాంటప్లైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కువైట్‌లో సుమారు 90 శతం తాగునీరు డీసాలినేషన్ నుంచే వస్తుంది. ఇక ఒమన్‌లో సుమారు 86 శాతం, సౌదీ అరేబియాలో సుమారు 70 శాతం తాగునీటి కోసం ఈ డీసాలినేషన్ ప్లాంట్లపై ఆధారపడుతున్నారు. ఒకవేళ ఈ డీసాలినేషన్ ప్లాంట్లు పనిచేయకపోతే కొన్ని రోజుల్లోనే ప్రధాన నగరాల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే అంతముఖ్యమైన ఈ ప్లాంట్లు యుద్ధ సమయంలో దెబ్బతింటే ఆ దేశాల్లో భారీ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. డీసాలినేషన్ ప్లాంట్లలో చాలా భాగం పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Attacks on Desalination Plants Gulf Countries Water Crisis Gulf War 2026 Infrastructure Sabotage in Gulf Middle East Water Security Saudi Arabia Water Infrastructure Telugu News Paper Telugu News Today UAE Water Safety West Asia Conflict Updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.