అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు యుద్ధ హెచ్చరికల వరకు దారితీసింది. ఇరాన్(Iran)ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) హెచ్చరికలు జారీ చేశారు. అణ్వాయుధాల తయారీని పూర్తిగా నిరోధించే కొత్త అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి ఇరాన్ వెంటనే ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఇరాన్ మొండిగా వ్యవహరించి చర్చలకు రాకపోతే.. ఆ దేశంపై భీకర స్థాయిలో విరుచుకుపడతామని, అది ఇరాన్ వినాశనానికి దారితీస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అణ్వాయుధాలు లేని ప్రపంచం అందరికీ మేలు చేస్తుందన్నారు.
Read Also: Budget 2026: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం: రాష్ట్రపతి ముర్ము
గతంలో కంటే దారుణమైన దాడులు
సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఈ ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలు ఇప్పటికే ఇరాన్ దిశగా బయలుదేరాయని వెల్లడించారు. ఆ నౌకలు ఎంతో వేగంతో, స్పష్టమైన లక్ష్యంతో కదులుతున్నాయని చెప్పారు. ఇరాన్ ఆలోచించుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉందని, త్వరగా ఒప్పందానికి అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో కంటే దారుణమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ఇరాన్‌ను హెచ్చరించారు. అమెరికా నుంచి ముప్పు పొంచి ఉందని గ్రహించిన ఇరాన్, తనను తాను కాపాడుకోవడానికి పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో పడింది. అమెరికా దాడులు చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధమవుతూనే.. పొరుగు దేశాల సహకారం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌కు కొన్ని కీలక దేశాల నుండి భరోసా లభించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. ఒకవేళ అమెరికా తమను బలవంతంగా యుద్ధం వైపు నెడితే, తాము కూడా ఊరుకోమని, గతంలో ఎన్నడూ చేయని విధంగా అమెరికాపై ఎదురుదాడి చేస్తామని హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: