📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

H1-B: గ్రీన్‌కార్డుల ప్రక్రియలో గూగుల్‌ వేగం

Author Icon By Vanipushpa
Updated: December 23, 2025 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో తాత్కాలిక వీసాలపై పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు ఇది నిజంగా గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. ఈ మేరకు టెక్‌ దిగ్గజం గూగుల్‌ గుడ్‌న్యూస్‌ ఏంటో చెప్పింది. వచ్చే ఏడాది తమ సంస్థలో పనిచేసే హెచ్‌-1బీ (H-1B) ఉద్యోగులకు ‘గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌ ప్రక్రియ’ను వేగవంతం చేయనున్నట్లు వివరించింది. ఈ మేరకు ఇంటర్నల్‌ న్యూస్‌లెటర్‌లో ఉద్యోగులకు దీనిపై సమాచారం ఇచ్చినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడి చేశాయి. అర్హత కలిగిన ఉద్యోగులకు సంబంధించి 2026లో PERM దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు ఈ మేరకు గూగుల్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది.

Read Also: VenkaiahNaidu: విద్య, వైద్యం తప్ప మిగతావి ఫ్రీగా అవసరం లేదు

H-1B

కాగా PERMకు అర్హత సాధించిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గూగుల్‌ (Google) ఇమిగ్రేషన్‌ చట్ట సంస్థల నుంచి పిలుపు వస్తుందని కంపెనీ తమ ఇంటర్నల్‌ మెమోలో పేర్కొన్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. అయితే, ఈ ప్రణాళిక గురించి గూగుల్‌ ఇంతవరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. కానీ, ట్రంప్‌ కఠిన వలస విధానాలు, వీసా ఫీజులు, సోషల్‌ మీడియా వెట్టింగ్‌ నిబంధనల వేళ.. టెక్‌ దిగ్గజం నిర్ణయం అనేకమంది హెచ్‌-1బీ ఉద్యోగులకు ఊరట కలిగిస్తుందనటంలో సందేహం లేదు.

ఉద్యోగులకు శాశ్వత నివాసం దక్కేలా కంపెనీలు సాయం

కాగా అమెరికా ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డుల జారీ ప్రక్రియలో ‘ప్రోగ్రామ్‌ ఎలక్ట్రానిక్‌ రివ్యూ మేనేజ్‌మెంట్‌ (PERM)’ది కీలక పాత్ర. దీన్ని టెక్‌ కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తున్నాయి. తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు శాశ్వత నివాసం దక్కేలా కంపెనీలు సాయం చేస్తుంటాయి. PERM ఆమోదం లభించిన తర్వాతే సదరు ఉద్యోగి తన గ్రీన్‌ కార్డు ప్రక్రియలో ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇందుకు చాలా షరతులు ఉంటాయి. సంబంధిత విదేశీ ఉద్యోగిని నియమించుకోవడం వల్ల అమెరికా వర్కర్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీలు నిరూపించాలి. అంతేకాదు.. ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన అమెరికన్లు అందుబాటులో లేరని రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

employment based green card Google Green Card process H1B visa immigration policy Tech workers Telugu News Paper Today news United States US Immigration

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.