📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Google: అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం

Author Icon By Sushmitha
Updated: November 5, 2025 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెక్నాలజీ దిగ్గజం గూగుల్(Google) మరో భారీ ప్రయోగానికి తెరతీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)(Artificial Intelligence) కోసం ఏకంగా అంతరిక్షంలోనే డేటా సెంటర్లను నిర్మించేందుకు పరిశోధనలు ప్రారంభించినట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ ‘మూన్‌షాట్’ కార్యక్రమాన్ని ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ పేరుతో చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. భవిష్యత్తులో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించడంలో ఈ ప్రాజెక్ట్(project) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుందని గూగుల్ భావిస్తోంది. ఈ ప్రకటన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్షంలో భారీ డేటా సెంటర్లు రానున్నాయని అంచనా వేసిన కొద్ది వారాలకే రావడం గమనార్హం.

Read Also: America: రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ వింత వాదన

Google

ప్రాజెక్టు వివరాలు, లక్ష్యం

ఈ ప్రాజెక్టులో భాగంగా, గూగుల్ తన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (టీపీయూ) ను అంతరిక్షంలోకి పంపనుంది. సౌరశక్తితో పనిచేసే చిన్నపాటి ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఏఐ డేటా సెంటర్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉపగ్రహాలను ఒకదానికొకటి ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ లింక్స్ ద్వారా అనుసంధానిస్తారు.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) మాట్లాడుతూ, “మా టీపీయూలు అంతరిక్షంలోకి వెళ్తున్నాయి. క్వాంటం కంప్యూటింగ్, అటానమస్ డ్రైవింగ్ లాంటి మా మూన్‌షాట్ ప్రాజెక్టుల స్ఫూర్తితోనే ‘ప్రాజెక్ట్ సన్‌క్యాచర్’ను ప్రారంభించాం. సౌరశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకుని అంతరిక్షంలో ఏఐ వ్యవస్థలను ఎలా నిర్మించవచ్చో అన్వేషిస్తున్నాం” అని తెలిపారు. 2027 ప్రారంభం నాటికి ప్లానెట్ సంస్థ భాగస్వామ్యంతో రెండు ప్రయోగాత్మక ఉపగ్రహాలను ప్రయోగించడమే తమ తదుపరి లక్ష్యమని ఆయన వివరించారు.

అంతరిక్షంలో ఎందుకు?

ఏఐ అల్గారిథమ్‌లకు అపారమైన విద్యుత్ శక్తి అవసరం. భూమిపై ఈ విద్యుత్ అవసరాలు పర్యావరణంపై భారం మోపుతున్నందున గూగుల్ అంతరిక్షాన్ని పరిష్కారంగా ఎంచుకుంది.

రేడియేషన్, థర్మల్ మేనేజ్‌మెంట్ వంటి సాంకేతిక సవాళ్లు ఉన్నప్పటికీ, తమ ట్రిలియం-జనరేషన్ టీపీయూలు భూమికి సమీప కక్ష్యలోని రేడియేషన్‌ను తట్టుకోగలవని గూగుల్ తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AI Data Centers Artificial intelligence Google Google News in Telugu Latest News in Telugu Planet Labs Project SunCatcher space data centers Space Technology Sundar Pichai Telugu News Today Tensor Processing Units TPU

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.