📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Google: అమెరికా దాటి వెళ్లకండి అని ఉద్యోగులకు హెచ్చరిక

Author Icon By Saritha
Updated: December 20, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెక్ రంగంలోని ప్రముఖ సంస్థ గూగుల్(Google) తన విదేశీ ఉద్యోగులకు కీలక సూచనలు చేసింది. ట్రంప్ (Trump) ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన వీసా నిబంధనల నేపథ్యంలో, కొంతకాలం పాటు అంతర్జాతీయ ప్రయాణాలను తప్పించుకోవాలని ఉద్యోగులకు సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా అమెరికాలో హెచ్-1బి తదితర వీసాలపై పనిచేస్తున్న సిబ్బంది ప్రస్తుతం అమెరికా బయటకు వెళ్లవద్దని గూగుల్ స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లాల్సి వస్తే, తిరిగి అమెరికాలోకి ప్రవేశించేందుకు చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని సంస్థ హెచ్చరించింది. కొన్ని సందర్భాల్లో ఇది ఏడాది వరకు కూడా కావచ్చని ఉద్యోగులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై గూగుల్ అంతర్గతంగా ఒక మెమో విడుదల చేసినట్లు సమాచారం.

Read also: ECI: SIR ప్రక్రియతో తమిళనాడులో 97 లక్షల ఓట్లు తొలగింపు

భారత్ ప్రయాణంపై ఆందోళన వ్యక్తం

విదేశాల్లోని(Google) అమెరికా రాయబార కార్యాలయాల్లో వీసా స్టాంపింగ్ ప్రక్రియలో ‘తీవ్రమైన’ జాప్యం జరుగుతోందని గూగుల్ పేర్కొంది. దీనివల్ల ఉద్యోగులు తమ స్వదేశాలకు వెళ్లి తిరిగి రావాలనుకుంటే భారీ ఆలస్యం తప్పదని తెలిపింది. ఈ హెచ్చరిక నేపథ్యంలో గూగుల్‌లో హెచ్-1బి వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది భారతీయులు ఇండియాకు రావాలంటే ఆందోళన చెందుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా నిబంధనల మార్పుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Google Google Employees H-1B Visa India Travel Concerns Latest News in Telugu Telugu News Trump Immigration Policies US Visa Delay Visa Processing

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.