📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: CEO: అనేక కారణాలతోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్

Author Icon By Vanipushpa
Updated: October 18, 2025 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాప్ సెర్చింజిన్ గూగుల్(Google). విశాఖపట్నంలో భారీ పెట్టుబడి పెట్టింది. 15 బిలియన్ డాలర్లతో డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ను నెలకొల్పనుంది. గిగావాట్ ప్లస్ డేటా సెంటర్ ఇది. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తోన్ మొట్టమొదటి AI కేంద్రం ఇదే. దీనికి సంబంధించి ఒప్పందాలు సైతం కుదిరాయి. ఈ డేటా సెంటర్ వల్ల వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. మరిన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది.

Read Also: Gautam Singhania : ఎలక్ట్రానిక్‌ వాహనాలను రాజకీయంగా ప్రమోట్‌ చేస్తున్నారు..! గౌతమ్‌

భారత్ లో గూగుల్ అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్

ఈ భారీ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి విశాఖపట్నాన్ని ఎంచుకోవడానికి గల కారణాలను గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్(Sundrai Pichai) వెల్లడించారు. డ్రీమ్‌ఫోర్స్‌ అనుబంధ సంస్థ సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. భారత్ లో గూగుల్ పెడుతున్న అతిపెద్ద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్ మెంట్ గా ఈ ప్రాజెక్ట్ ను అభివర్ణించారు.

Sundar Pichai

2026 నుండి 2030 మధ్యకాలంలో దీన్ని పూర్తి చేస్తామని సుందర్ పిచాయ్ వివరించారు. ఈ ప్రాజెక్ట్ లో గిగావాట్ స్థాయి డేటా సెంటర్ కార్యకలాపాలు, కొత్త ఇంధన వనరుల అభివృద్ధి, ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్ వంటివి ఉంటాయని తెలిపారు.

ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతంతో అనుకూలం

దీనికి 80 శాతం విద్యుత్ ను క్లీన్ ఎనర్జీ నుంచి తీసుకుంటామని, సబ్‌- సీ కేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తామని అని పిచాయ్ చెప్పారు. ఇంత భారీ పెట్టుబడి విశాఖపట్నంలో పెట్టడానికి గల కారణాలను ఆయన వివరించారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం, ప్రత్యేకించి భౌగోళిక, వాతావరణపరంగా అనుకూలంగా ఉంటోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన చిన్నప్పటి రైలు ప్రయాణాలను గుర్తు చేసుకున్నారు. విశాఖపట్నం లాంటి అందమైన తీర ప్రాంత నగరాన్ని చిన్నప్పుడే చూశానని, ఆ నగరంతో ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, తాను సీఈఓగా ఉంటోన్న గూగుల్ ఇప్పుడక్కడ భారీ పెట్టుబడులు పెడుతోండటం సంతోషంగా ఉందని అన్నారు.

గూగుల్ సీఈఓ జీతం రూపాయల్లో ఎంత?
గూగుల్ (ఆల్ఫాబెట్) సీఈఓ సుందర్ పిచాయ్ 2024లో సుమారు రూ. 900 కోట్ల (సుమారు $100 మిలియన్లు) వార్షిక పరిహార ప్యాకేజీని అందుకున్నారు, ఇది ఆయన చెల్లించిన రూ. 1,900 కోట్ల ($226 మిలియన్లు) పరిహారం కంటే చాలా తక్కువ.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google data center Visakhapatnam Google India expansion Google investment in Andhra Pradesh Latest News Breaking News tech infrastructure in Vizag Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.