📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Gold price today : ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి

Author Icon By Sai Kiran
Updated: January 6, 2026 • 8:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gold price today : బంగారం, వెండి ధరలు ఇక తగ్గుతాయేమో అనుకున్న పెట్టుబడిదారులకు మరోసారి షాక్ తగిలింది. అంతర్జాతీయంగా నెలకొన్న కొత్త ఉద్రిక్తతలు పసిడి, వెండి ధరలను ఒక్కసారిగా పైకి నెట్టేశాయి. ఒకవైపు వెనెజువెలాపై అమెరికా ఆకస్మిక దాడులు చేయడం, మరోవైపు భారత్‌పై టారిఫ్‌లు పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం వల్ల గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది.

ఈ పరిణామాల ప్రభావంతో ఇన్వెస్టర్లు మళ్లీ సురక్షిత (Gold price today) పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గోల్డ్, సిల్వర్ రేట్లు దేశీయంగా, అంతర్జాతీయంగా భారీగా పెరిగాయి. గత వారం గరిష్ఠ స్థాయిల నుంచి తగ్గిన ధరలు, ఇప్పుడు తిరిగి పుంజుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,450 డాలర్ల మార్కును దాటింది. ట్రంప్ టారిఫ్ హెచ్చరికలకు ముందు ఇది 4,320 డాలర్ల స్థాయిలో ఉండగా, ఒక్క రోజులోనే దాదాపు 120 డాలర్ల పెరుగుదల నమోదైంది. అలాగే స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 72 డాలర్ల నుంచి 77 డాలర్ల స్థాయికి చేరింది.

Read also: Mohammed Shami: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన షమీ..

ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ (Gold price today) మరింత బలహీనపడింది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ 90.28 వద్ద ట్రేడవుతోంది. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమైంది.

దేశీయ మార్కెట్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే రూ. 2,200 పెరిగి తులం రూ. 1,26,700కు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ. 2,400 పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,220గా ఉంది.

వెండి ధరలు మరింత వేగంగా పెరిగాయి. (Gold price today) ఒక్క రోజులోనే రూ. 8,000 పెరగడంతో హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 2.65 లక్షలకు చేరింది. గత డిసెంబర్ చివర్లో భారీగా పడిపోయిన వెండి రేట్లు, తాజా అనిశ్చితుల నేపథ్యంలో మళ్లీ రికార్డ్ స్థాయిల దిశగా పయనిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu commodity market news Gold Price today gold rate Hyderabad Google News in Telugu international gold price Latest News in Telugu rupee dollar rate safe haven investment Silver price today Silver rate India Telugu News Trump India tariffs venezuela us attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.