📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Gold: వరదల్లో కొట్టుకుపోయిన రూ.12కోట్ల బంగారం

Author Icon By Sharanya
Updated: August 2, 2025 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగారాన్ని ఎవరైనా భద్రంగా దాచుకుంటారు. బీరువాల్లో, లాకర్లల్లో పెట్టి వాటిని ఎంతో భద్రత కల్పిస్తాం. ఇక వంటిపై వాటిని ధరించినా, కళ్లన్నీవాటిపై ఉంచి జాగ్రగా చూస్తుంటాం. ఎందుకంటే బంగారం ధరలకు రోజురోజుకు రెక్కలొస్తున్నాయి. లక్షల్లో ధరలు పలుకుతున్నాయి. అలాంటిది కోట్లాది విలువచేస్తే వరదల్లో కొట్టుకునిపోతే ఎలా ఉంటుంది? సరిగ్గా చైనాలో ఇదే జరిగింది. గతకొన్ని రోజుల నుంచి చైనా (China) లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా పాంతాల్లో వరదలు పోటెత్తాయి. షాంగ్జీ ప్రావిన్స్ లో వరదల ప్రభావం వల్ల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ నగల దుకాణంలో నుంచి బంగారం (Gold), వెండి ఆభరణాలు కొట్టుకుపోవడం కలకలం రేపింది. వాటి విలువ రూ.12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. దీంతో వాటి కోసం వీధుల్లో ఉండే స్థానికులు వెతికేందుకు పోటీపడ్డారు. బంగారం కోసం గంటల తరబడి వాళ్లు వెతుకుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోసల్మీడియాలో వైరల్ అవుతోంది.


సముద్రతీరంలోని ప్రాంతం

జులై 25న షాంగ్జీ ప్రావిన్స్ (Shaanxi Province) లోని వుచి కౌంటీలో భారీ వరదల వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్రతీరానికి దగ్గర్లోనే ఈ ప్రాంతం ఉంది. లావో ఫెంగ్జియాంగ్ అనే జువెల్లరీ షాప్ నుంచి ఆభయణాలు కొట్టుకుపోయాయి. ఆ రోజున ఎప్పట్లాగే ఆభరణాల దుకాణాన్ని తెరిచి ఉంచారు. కానీ భారీ వర్షాల వల్ల ఆ ప్రాంత నీటమునిగింది. ఈ క్రమంలోనే వరద షాప్ లోకి వచ్చింది. వరద ఉద్ధతి పెరగడం వల్ల సిబ్బంది కళ్లముందే ఆభరణాలు కొట్టుకుపోయాయి. అది చూసిన సిబ్బంది షాకైపోయారు. వరదల్లో కొట్టుకుపోయిన ఆభరణాల్లో బంగారు (Gold) హారాలు, ఉంగరాలు, చెవి దుద్దులు, గాజులతో పాటు వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని దుకాణ యజమాని మీడియాకు చెబుతూ ఆవేదన చెందారు. అంతేకాదు సేఫ్ సెఫ్ బాక్సులో రీసైకిల్ చేసిన బంగారం, అలాగే భారీగా నగదు ఉన్నాయని.. అది కూడా వరదల్లో కొట్టుకుపోయిందని వాపోయారు. మొత్తంగా తన షాపులో నుంచి 20కిలోల బంగారం, నగదు కొట్టుకుపోయినట్లు చెప్పారు. దీని విలువ 10మిలియన్ల యువాన్లు మన కరెన్సీలో రూ.12 కోట్లుపైగానే ఉన్నట్లు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/earthquake-major-earthquake-in-afghanistan/international/524729/

Breaking News Flood News India Gold in Floods Gold Missing in Flood latest news Natural Disaster Rs 12 Crore Gold Lost Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.