పాకిస్తాన్‌లో (Pakistan) బంగారం ధరల (Gold Price) పతనం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ పసిడి రేట్లు భారీగా తగ్గాయి. గురువారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ. 25,500 తగ్గగా, రెండు రోజుల్లో మొత్తం క్షీణత రూ. 61,000గా నమోదైంది. ఈ తగ్గుదలతో కొనుగోలుదారులు మార్కెట్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు.
ఆల్ పాకిస్తాన్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ సరాఫా అసోసియేషన్ (APGJSA) విడుదల చేసిన వివరాల ప్రకారం, గురువారం తులం బంగారం ధర రూ. 25,500 తగ్గి రూ. 5,11,862కి చేరింది. అదేవిధంగా, 10 గ్రాముల బంగారం ధర రూ. 21,862 తగ్గి రూ. 4,38,839 వద్ద నిలిచింది. అంతకుముందు రోజు, బుధవారం కూడా తులంపై రూ. 35,500 తగ్గడం గమనార్హం.
Read Also: Market Impact: బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు (Gold Price) భారీగా పడిపోయాయి. ఔన్స్ బంగారం ధర 255 డాలర్లు తగ్గి 4,895 డాలర్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం, స్థానిక మార్కెట్‌లో డిమాండ్ వంటి అంశాలే ఈ క్షీణతకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం, జనవరి 28న తులం బంగారం ధర రూ. 5,51,000 దాటి ఆల్-టైమ్ రికార్డును సృష్టించింది. రికార్డు స్థాయికి చేరిన తర్వాత ధరలు ఒక్కసారిగా కుప్పకూలడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు మార్కెట్ తీరును జాగ్రత్తగా గమనిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: