అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. అగ్ర దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ మార్పులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నారు. టారిఫ్ మీద ట్రంప్ (Trump) ప్రకటించిన యుద్ధం ఇతర దేశాలతో పాటు అమెరికా మీద కూడా తీవ్రమైన ప్రభావాన్నే చూపిస్తోంది. టారిఫ్ దూకుడుతో అమెరికాలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కాగా డాలర్ విలువ కుప్పకూలింది. ఇదే సమయంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ట్రంప్ నిర్ణయాల ప్రభావం బంగారు మార్కెట్లలో, కరెన్సీ ట్రేడింగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా డాలర్ నాలుగు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇక బంగారం ధర అయితే చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రూ. 5 వేల మార్కుని దాటి పెట్టుబడిదారులకు లాభాల పంట పండించింది.
Read Also: Weather Update: దక్షిణ భారత్‌కు వర్ష సూచన
RBI వద్ద సుమారు 880 టన్నుల బంగారం నిలువ
ఒకప్పుడు గృహ పెట్టుబడిదారులకు మాత్రమే సురక్షిత ఆస్తిగా భావించిన బంగారం, ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద పెట్టుబడిదారులైన కేంద్ర బ్యాంకులకు ప్రధాన ఆస్తిగా మారింది. మన దేశమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. జనవరి 16తో ముగిసిన వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విదేశీ మారక నిల్వలు 14 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. ఇది గత పది నెలల్లో అతిపెద్ద వారపు పెరుగుదల. అయితే ఈ వృద్ధిలో దాదాపు మూడవ వంతు బంగారం నిల్వల విలువ పెరగడం వల్లే వచ్చింది. ప్రస్తుతం RBI వద్ద సుమారు 880 టన్నుల బంగారం ఉంది. గత ఏడాదిలో విదేశీ కరెన్సీ ఆస్తులు కేవలం 5 శాతం మాత్రమే పెరిగితే, బంగారం ఒక్కటే RBI మొత్తం హోల్డింగ్స్ విలువను దాదాపు 70 శాతం వరకు పెంచింది. ఫలితంగా భారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 12 శాతం నుంచి 17 శాతానికి చేరింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: