📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest Telugu News: Cloudflare: సాంకేతిక సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన కీలక వెబ్‌సైట్లు

Author Icon By Vanipushpa
Updated: December 5, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ (సీడీఎన్) సంస్థ క్లౌడ్‌ఫ్లేర్‌(Cloudflare)లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మూడు వారాల వ్యవధిలో ఇది రెండోసారి కావడంతో ప్రపంచవ్యాప్తంగా పలు కీలక వెబ్‌సైట్లు, యాప్‌ల సేవలు నిలిచిపోయాయి. ఇవాళ‌ చోటుచేసుకున్న ఈ అంతరాయం కారణంగా భారత్‌లో క్యాన్వా, బుక్‌మైషో, గ్రో, జెరోధా వంటి కీలక సంస్థల సేవలతో పాటు అంతర్జాతీయంగా లింక్డ్ఇన్, స్పేస్‌ఎక్స్, కాయిన్‌బేస్ వంటి సైట్లు యూజర్లకు అందుబాటులో లేకుండా పోయాయి.

Cloudflare

“క్లౌడ్‌ఫ్లేర్‌లో ప్రపంచవ్యాప్త అంతరాయం

ఈ సమస్య కారణంగా చాలా వెబ్‌సైట్లను ఓపెన్ చేయగా “500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ (క్లౌడ్‌ఫ్లేర్)” అనే సందేశం కనిపించింది. ఆశ్చర్యకరంగా, ఇతర వెబ్‌సైట్ల పనితీరును పర్యవేక్షించే ‘డౌన్‌డిటెక్టర్’ వెబ్‌సైట్ కూడా కొంతసేపు పనిచేయలేదు. ఈ అంతరాయంపై క్లౌడ్‌ఫ్లేర్ వెంటనే స్పందించింది. తమ డ్యాష్‌బోర్డ్, ఏపీఐలలో సమస్యలు తలెత్తినట్టు గుర్తించామని, వెంటనే పరిష్కార మార్గాలను అమలు చేశామని తెలిపింది. ప్రస్తుతం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ‘గ్రో’ ఈ విషయంపై స్పందిస్తూ, “క్లౌడ్‌ఫ్లేర్‌లో ప్రపంచవ్యాప్త అంతరాయం కారణంగా మా సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి” అని ఎక్స్ వేదికగా పేర్కొంది. అలాగే ఫొటో ఎడిటింగ్ యాప్ ‘క్యాన్వా’ కూడా తమ సీడీఎన్ ప్రొవైడర్ అయిన క్లౌడ్‌ఫ్లేర్ వైఫల్యం వల్లే తమ సేవలు నిలిచిపోయాయని స్పష్టం చేసింది. నవంబర్ 18న కూడా ఇలాంటి అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. క్లౌడ్‌ఫ్లేర్ చర్యలతో ప్రస్తుతం సేవలు నెమ్మదిగా పునరుద్ధరణ అవుతున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu global website outage Google News in Telugu internet disruption Latest In telugu news server downtime tech infrastructure issues technical glitch web services affected

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.