📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Global GDP: అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

Author Icon By Pooja
Updated: February 1, 2026 • 5:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ పెద్దన్నగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న అమెరికాకు, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఊహించని హెచ్చరిక ఇచ్చారు. అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో అమెరికా స్థానం క్రమంగా బలహీనపడుతోందని, అధికార సమతుల్యత మారుతున్న దశకు చేరిందని మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.

Read Also:Pak : పాక్ దాడులు.. 125 మంది మృతి

జీడీపీ వృద్ధిలో భారత్, చైనా దూకుడు – అమెరికా వెనుకబాటు

ఈ ఏడాది గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక జీడీపీ(Global GDP) కలిగిన దేశంగా అమెరికా 31.82 ట్రిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చైనా 20.65 ట్రిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా, జర్మనీ 5.33 ట్రిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచింది. భారత్ మాత్రం 4.51 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

కానీ మొత్తం జీడీపీ కంటే కీలకమైన ప్రపంచ జీడీపీ వృద్ధిలో ఆయా దేశాల పాత్రను పరిశీలిస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో చైనా 26.6 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ 17 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా, అమెరికా కేవలం 9.9 శాతం వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది.

అమెరికాను దాటుతూ ఇండోనేషియా, టర్కీ, నైజీరియా, బ్రెజిల్, వియత్నాం, సౌదీ అరేబియా, జర్మనీ వంటి దేశాలు కూడా ప్రపంచ వృద్ధిలో కీలక పాత్ర(Global GDP) పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్ “ప్రపంచ అధికార సమతుల్యత మారుతోంది” అంటూ ట్వీట్ చేయడం అమెరికాకు హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు ట్రంప్‌కు సన్నిహితుడిగా ఉన్న మస్క్, తర్వాత దూరమవడం కూడా ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం తెచ్చిపెట్టింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

DonaldTrump Google News in Telugu Latest News in Telugu WorldEconomy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.