ఇరాన్(Iran) యుధ్దం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. పశ్చిమాసియా దేశాలపై అమెరికా ప్రయోగించిన వార్ అంతర్జాతీయంగా తీవ్ర ప్రకంపనలను రేపుతోంది. చమురు ధరలు భారీగా పెరిగాయి. సరఫరా ఆగిపోయింది. చమురు ఉత్పత్తి చేసే దేశాలు వార్ దెబ్బకు ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు కొరత ఏర్పడింది. ఇదే అదనుగా ధరలను భారీగా పెంచేశాయి పలు దేశాలు. దీంతో ఇప్పుడు ప్రపంచం చమురు రంగంలో సంక్షోభం దిశగా పయనించే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే బ్రెంట్ క్రూడ్ ధరలు 29 శాతం పెరిగి ప్రతి బారెల్ 100 డాలర్లకి మించిన స్థాయికి చేరుకున్నాయి. ఈ స్థాయి చివరిసారిగా 2022లో మాత్రమే కనబడింది. నూనె ధరల ఈ హఠాత్ పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాలను చూపుతోంది. ఆర్థిక నిపుణులు ఈ పెరుగుదల 1970ల మధ్యలో జరిగిన భారీ ఆయిల్ సంక్షోభాన్ని గుర్తుచేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణం పశ్చిమాసియాలో రాజకీయ ఉద్రిక్తతలు. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య సైనిక, రాజకీయ ఒత్తిడి అని చెప్పవచ్చు.
Read Also: Indian Rupee: చమురు ధరలు పెరగడంతో.. కుప్పకూలిన రూపాయి విలువ
అంతర్జాతీయ మార్కెట్లు ఆందోళన
దీని ప్రభావంతో ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం అయిన స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మూసివేసింది ఇరాన్. దీంతో పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. ఇది నూనె ధరలను వేగంగా పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లు ఆందోళనలోకి వెళ్లాయి. 1973లో యొమ్ కిప్పూర్ యుద్ధం తర్వాత అరబ్ దేశాలు కొన్ని దేశాలపై చమురు ఎగుమతులను నిలిపివేసి ఎంబార్గో విధించగా..ఆ సమయంలో నూనె ధరలు 300శాతం పెరిగి 3 డాలర్ల నుంచి 12 డాలర్ల వరకు చేరాయి. ఈ సరఫరా లోపం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించి, దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచింది. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. నేడు నూనె ధరల వేగవంతమైన పెరుగుదల 1970ల ర్యాలీని పోలుస్తోంది. అందుకే నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. నేటి పరిస్థితి 1970లతో కొంత సమానంగా ఉన్నప్పటికీ.. కొన్ని కీలక భేదాలు స్పష్టంగా ఉన్నాయి. 1973లో నేరుగా సరఫరా తగ్గించబడినప్పటి అంశాలతో పోల్చితే, నేటి ఉద్రిక్తతలు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా రవాణా ఆలస్యంగా లేదా నిలిపివేయడం ద్వారా మాత్రమే ప్రభావం చూపిస్తున్నాయి. 1970లలో ధరల పెరుగుదల డైరెక్ట్‌గా సరఫరా తగ్గుదల కారణంగా జరిగింది. కానీ నేటి పెరుగుదలలో పారిశ్రామికత, పెట్టుబడులు, గ్లోబల్ మార్కెట్ భావాలు కారణం అవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: