📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

దోమ‌లు కొట్టండి డబ్బులు పట్టండి

Author Icon By Anusha
Updated: February 20, 2025 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫిలిప్పైన్స్‌లో ప్రస్తుతం దోమల బెడద తీవ్రమై, ప్రజలు డెంగ్యూ వంటి వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని మనీలా సమీపంలోని అడిషన్ హిల్స్ పట్టణంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. అక్కడి జనాభా లక్షకు పైగా ఉండగా, ప్రతి ఇంట్లో దోమల విపత్తు రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు డెంగ్యూ కారణంగా ఆసుపత్రిపాలవుతున్నారు. కొందరైతే ప్రాణాలు కోల్పోయారు. పైగా డెంగీ జ్వరంతో ఏకంగా ఇద్దరు విద్యార్థులు ఇటీవలె మరణించారు. ఫిబ్రవరి 1 నాటికి ఫిలిప్పీన్స్‌లో ఏకంగా 28,234 మంది డెండీ జ్వరంతో మంచం పట్టారు.ప్రభుత్వం, స్థానిక అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా దోమల సంఖ్య తగ్గకపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.దోమ‌ల‌ను అరిక‌ట్టే ప్ర‌ణాళిక‌లో భాగంగా అక్క‌డి నాయ‌కుడు ఒక‌రు వినూత్న‌మైన ఆలోచ‌న చేశాడు. దోమ‌లు ప‌ట్టుకొని తెండి.. బ‌తికున్నా, చ‌నిపోయినా ప‌ర్వాలేదు.ప్రతి ఐదు దోమలను పట్టి అధికారులకు ఇచ్చిన వారికి ఒక ఫిలిప్పైన్స్ పెసో(భార‌త క‌రెన్సీలో రూపాయిన్న‌ర‌) ఇస్తాన‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు.ఉదాహరణకు,500 దోమలు పట్టి ఇస్తే 100 పెసోలు (దాదాపు రూ.150) పొందవచ్చు.

దోమలు చిన్నతనం నుంచి మనకు తెలిసిన హానికర కీటకాలు. ముఖ్యంగా వర్షాకాలం రాగానే దోమల బెడద మరింతగా పెరుగుతుంది. ఇవి రాత్రిళ్లు ఎక్కువగా చురుగ్గా తిరుగుతూ మనల్ని కుట్టి రక్తాన్ని పీలుస్తాయి. దోమ కాటుకు గురైనప్పుడు చర్మం ఎర్రబడటం, కురుపలు రావడం, స్వల్పంగా మంట, కలగడం సాధారణ లక్షణాలు. అయితే, కొన్నిసార్లు ఈ దోమ కాట్లు ప్రాణాంతకమయ్యే వ్యాధులకు దారితీస్తాయి.

దోమల వల్ల వచ్చే ప్రధాన వ్యాధులు

డెంగీ-డెంగీ వైరస్‌ వల్ల ఉత్పన్నమయ్యే వ్యాధి. తీవ్రమైన జ్వరం, శరీరంలో నొప్పులు, రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడం ప్రధాన లక్షణాలు.

మలేరియా-ప్లాస్మోడియమ్ పేరుతో ఒక పరాన్నజీవి కారణంగా వచ్చే వ్యాధి. దీని లక్షణాలు మాంద్యం, అధిక జ్వరం, తల నొప్పి, చలి.

చికున్‌గున్యా-దీనివల్ల తీవ్రమైన కీళ్ళ నొప్పులు, జ్వరం, చర్మంపై దద్దుర్లు కనిపించవచ్చు.

దోమల ప్రబలడానికి కారణాలు:

నిలువ నీటి గుంతలు

శుభ్రత లేకపోవడం

చెత్తాచెదారం పేరుకుపోవడం

మురికినీరు, డ్రైనేజ్ లీకేజీలు

ఖాళీ ప్లాట్లు, పొదలు, పాడుబడిన ప్రదేశాలు

దోమల నివారణ చర్యలు:

ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

దోమల ఆవాసాలు నాశనం చేయాలి.

డ్రైనేజీలు శుభ్రం చేయించాలి.

ఇంట్లో దోమతెరలు, దోమల మందులు వాడాలి.

నిమ్మపెత్తని నూనె లేదా వేప నూనె వాడి దోమలను అడ్డుకోవచ్చు.

పూర్తి చేతులు, కాళ్లు కప్పే దుస్తులు ధరించాలి.

రాత్రిపూట దోమతెర కింద పడుకోవడం ఉత్తమం.

ఫిలిప్పీన్స్‌ వంటి కొన్ని దేశాల్లో ఇప్పుడు దోమలు పట్టి ఇవ్వడానికి డబ్బు ఇస్తున్నారు. ప్రతి ఐదు దోమలకు ఒక పెసో ఇస్తున్నారు. ఇది వినూత్న ప్రయత్నమే అయినా, ప్రజలు దోమలు పట్టే క్రమంలో ప్రమాదాలు కూడా ఉన్నాయి. దోమ కాటుకు గురి కావడం వల్ల వారు మరింత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.

#DenguePrevention #EarnMoney #HealthAwareness #IncredibleOffer #MosquitoCatchChallenge #MosquitoHunting #PhilippinesNews #ViralNews Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.