📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Latvia: భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

Author Icon By Vanipushpa
Updated: December 6, 2025 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెండ్లి కాని పురుషులకు యూరప్‌ దేశమైన లాత్వియాలో (Latvia) బహు డిమాండ్‌ ఉంది. అక్కడ లింగ అసమతుల్యత కారణంగా అమ్మాయిలకు ఈడు వచ్చినా తోడు దొరక్క అల్లాడుతున్నారు. పెండ్లి చేసుకోవడానికి అబ్బాయిలే కరవవుతున్నారు. దీంతో వారు ఇంటి, ఇతర పనుల కోసం భర్తలను అద్దెకు (Rent Husbands) తీసుకుంటున్నారని న్యూయార్క్‌ పోస్ట్‌ వెల్లడించింది. ఆ పత్రిక కథనం ప్రకారం ఆ దేశంలో పురుషుల కన్నా మహిళల సంఖ్య 15.5 శాతం ఎక్కువగా ఉంది. ఇది యూరోపియన్‌ యూనియన్‌లో సగటు అంతరం కన్నా మూడు రెట్లు ఎక్కువ. 65 అంతకన్నా ఎక్కువ వయసున్న వారిలో పురుషుల కన్నా మహిళలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నారని వరల్డ్‌ అట్లాస్‌ వెల్లడించింది. దేశంలో పురుషుల కొరత పని ప్రదేశాలలో, రోజువారీ జీవితంలో స్పష్టంగా కన్పిస్తున్నది.

Read Also: Maali: ఉగ్రవాదుల చరలో చిక్కుకున్న భువనగిరి యువకుడు

Latvia

‘గంటల లెక్కన భర్తలను పొందండి’

దేశంలో పురుషుల కొరత తీవ్రంగా ఉండటంతో పలువురు మహిళలు తమ భాగస్వామిని వెతుక్కునేందుకు విదేశాలకూ కూడా వెళ్లిపోతున్నారు. అలా చేయలేని వారు భర్తలను గంటలు, రోజుల లెక్కన అద్దెకు తెచ్చుకుని వారి సేవలు పొందుతున్నారు. కొమండా 24 లాంటి సంస్థలు ‘గంటల లెక్కన భర్తలను పొందండి’ నినాదంతో పురుషులను అద్దెకు ఇవ్వడం ప్రారంభించాయి. తాము అద్దెకు ఇచ్చే భర్తలు ప్లంబింగ్‌, కార్పెంటరీ, మరమ్మతులు, ఇంటి పనులు చేయడంలో కూడా నిష్ణాతులని ఆ సంస్థ పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu Human interest story Latest In telugu news Modern Lifestyles Renting Husbands Social issues Social Trend Telugu News Today Unusual Practices Women Support System

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.