ఆ కళ్లలో ఒకప్పుడు డాక్టర్ అవ్వాలనే కలలు ఉండేవి.. ఆ చేతులు పెన్ను పట్టి ప్రపంచాన్ని మార్చేస్తాయన్న నమ్మకం ఉండేది. కానీ నేడు.. అదే కళ్లలో నీడలు ముసిరాయి, ఆ చేతులు వంటింటి పనికి, అణిచివేతకు అలవాటు పడిపోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్()లో తాలిబన్ల రాకతో ఆగిపోయిన కాలం, లక్షలాది మంది బాలికల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. తాజాగా యునిసెఫ్ విడుదల చేసిన నివేదిక.. అక్కడి కఠిన వాస్తవాలకు అద్దం పడుతోంది.ఆఫ్ఘనిస్తాన్‌లో దాదాపు 22 లక్షల మంది కౌమార బాలికలు నేడు బడి గడప తొక్కలేకపోతున్నారు. సెకండరీ విద్యపై తాలిబన్లు విధించిన నిషేధం వల్ల.. ఆరో తరగతి పూర్తి కాగానే బాలికల పుస్తకాలు మూతపడుతున్నాయి. “స్కూల్ తెరుస్తారని ఎదురుచూసి ఎదురుచూసి అలసిపోయాం.. మా కలలు ఎండమావిలా మారిపోయాయి” అని ఓ 16 ఏళ్ల బాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రాథమిక విద్య పూర్తి చేసిన వారిలో కూడా 93% మంది కనీసం చదవడం, రాయడం కూడా రాని దుస్థితి నెలకొంది.
Read Also: Winter Storm Hits US : USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
బాల్య వివాహాల ఉచ్చు.. మౌనమే సమాధానమా?
2021 ఆగస్టులో టాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. మొదట “తాత్కాలిక నిర్ణయం”గా ప్రకటించిన నిషేధం, క్రమంగా శాశ్వత శిక్షగా మారింది. ఆరు తరగతి దాటిన బాలికలకు పాఠశాలల తలుపులు మూసివేశారు. యూనివర్సిటీల్లో మహిళల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేశారు. బాల్య వివాహాల ఉచ్చు.. మౌనమే సమాధానమా? విద్యకు దూరం కావడంతో ఆ బాలికలకు మరో భయంకరమైన ముప్పు పొంచి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: