భారతదేశంలో గిగ్ ఎకానమీ శరవేగంగా విస్తరిస్తోంది. డెలివరీ పార్ట్‌నర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు ఇలా కోట్లాది మంది ఈ రంగంపైనే ఆధారపడి బతుకుతున్నారు. అయితే వీరికి స్థిరమైన ఆదాయం కానీ, సామాజిక భద్రత కానీ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్ (Budget 2026) పై ఈ వర్గాలన్నీ ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల పనులు ఆగిపోయినప్పుడు తమను ఆదుకునే వ్యవస్థ కావాలని వారు కోరుతున్నారు. వాతావరణ మార్పులు – ఆదాయానికి గండి ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు గిగ్ వర్కర్ల బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. తీవ్రమైన ఎండలు, అకస్మాత్తుగా వచ్చే వరదలు బయట పనిచేసే డెలివరీ బాయ్స్, డ్రైవర్ల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. ‘Plutas.AI’ వ్యవస్థాపకులు అంకుర్ ఇంద్రకుష్ ప్రకారం.. కేవలం నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా, ఆదాయం ఆగిపోయిన వెంటనే ఆర్థిక సాయం అందే ‘పారామెట్రిక్ క్లైమేట్ ఇన్సూరెన్స్’ వ్యవస్థను ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో ప్రవేశపెట్టాలి. 2024-25లో ప్రకృతి వైపరీత్యాల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా.. లక్షలాది ఇళ్లు, పశువులు నాశనమవ్వడం గమనార్హం.
Read Also: Venezuela Crisis: అమెరికా దాడికి ముందు లీక్ అయిన సంభాషణ
డిజిటల్ లోన్ల విషయంలో జాగ్రత్త
యువతకు ఆర్థిక వెసులుబాటు నేటి తరం యువత ఎక్కువగా ఫ్రీలాన్సింగ్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ పై ఆధారపడుతున్నారు. వీరు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ బడ్జెట్ లోయువ సంపాదనపరులకు పన్ను మినహాయింపులు, సులభమైన విద్యా రుణాలు అందించాలి. దీనివల్ల వారు తమ కెరీర్‌పై ధైర్యంగా పెట్టుబడి పెట్టగలరు. 2047 నాటికి గిగ్ వర్క్‌ఫోర్స్ 6.2 కోట్లకు చేరుతుందని అంచనా. అందుకే ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. డిజిటల్ లోన్ల విషయంలో జాగ్రత్త ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు గిగ్ వర్కర్లు డిజిటల్ లోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: