📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Purnam kumar bsf: పాక్ నుంచి BSF జవాన్‌కు ఘర్‌వాపసీ

Author Icon By Shobha Rani
Updated: May 14, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఘర్‌వాపసీ. ఇది నిజంగా భారత్‌కు రిలీఫ్‌నిచ్చే వార్త. ఆపరేషన్‌ సింధూర్‌(Operation sindoor) లో భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్‌- ఇక దుస్సాహసాలు చేయలేకపోతోంది. పొరపాటున పాక్‌ భూభాగంలో అడుగుపెట్టిన మన జవాన్‌ను తిరిగి అప్పగించింది. 20 రోజులపాటు పాక్‌లో బందీగానే జవాన్‌ PK షాను పాకిస్థాన్ అధికారులు క్షేమంగా పంపించారు. భారతదేశం నుండి బలమైన ఒత్తిడి.. చివరకు పాకిస్తాన్ BSF జవాను పూర్ణమ్ సౌను విడుదల చేయవలసి వచ్చింది. బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణబ్ కుమార్ షా పాకిస్థాన్ నుంచి తిరిగొచ్చారు. ఆ సైనికుడికి బదులుగా భారతదేశం రేంజర్స్‌ను కూడా తిరిగి ఇచ్చింది. సైనికుడు పికె షాను పాకిస్తాన్ భారతదేశానికి అప్పగించింది. అట్టారి సరిహద్దు నుండి తిరిగి వచ్చాడు. నిజానికి, BSF జవాన్ పీకే షా పొరపాటున సరిహద్దు దాటారు. అదే సందర్భంలో భారతదేశం పాక్‌కు చెందిన ఒక రేంజర్ జవాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇప్పుడు రెండు దేశాలు సైనికులను, రేంజర్లను మార్పిడి చేసుకున్నాయి. జవాన్, రేంజర్‌ను మార్పిడి చేసుకునేందుకు ఉదయం 10.30 గంటలకు అట్టారిలో చర్చలు జరిగాయి.
దౌత్య చర్చలు – సైనికుల మార్పిడి
మన సైనికుడు భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు BSF కు సమాచారం అందింది. బిఎస్ఎఫ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, బిఎస్ఎఫ్ జవాన్ పికె షా తిరిగి వచ్చారు. అతను 2025 ఏప్రిల్ 23 నుండి పాకిస్తాన్ రేంజర్స్ కస్టడీలో ఉన్నాడు. ఆ జవాన్‌ను ఉదయం 10:30 గంటల ప్రాంతంలో అట్టారి జాయింట్ చెక్ పోస్ట్ ద్వారా భారతదేశానికి అప్పగించారు. అప్పగించడం శాంతియుతంగా, ప్రోటోకాల్స్ ప్రకారం జరిగిందని BSF తెలిపింది.

Purnam kumar bsf: పాక్ నుంచి BSF జవాన్‌కు ఘర్‌వాపసీ

పాక్ రేంజర్ ఎలా పట్టుబడ్డాడు?
ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు దేశాల మధ్య క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించి పరస్పరం దాడులు కూడా జరిగాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు భారతదేశం తగిన సమాధానం ఇచ్చింది. దీని తరువాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. అయితే, కాల్పుల విరమణ తర్వాత, మే 14న, BSF, పాక్ రేంజర్లు తమ ప్రాంతాల నుండి పట్టుబడిన సైనికులను శాంతియుతంగా తిరిగి ఇచ్చారు. ఫిరోజ్‌పూర్‌లోని పాకిస్తాన్ సరిహద్దు నుంచి పాక్ రేంజర్లు ఆ భారత సైనికుడిని అరెస్టు చేశారు. మరోవైపు, రాజస్థాన్‌లోని భారత సరిహద్దు సమీపంలో బిఎస్‌ఎఫ్ ఒక పాకిస్తానీ రేంజర్‌ను పట్టుకుంది. ఆ సైనికుడికి బదులుగా, భారతదేశం పాక్ రేంజర్‌ను కూడా పాకిస్తాన్‌కు అప్పగించింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో బిఎస్‌ఎఫ్ ఒక పాకిస్తానీ రేంజర్‌ను అరెస్టు చేసింది. పాక్ రేంజర్ సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో, సరిహద్దు వద్ద పోస్ట్ చేసిన సైనికులు అతన్ని గమనించారు, ఆ తర్వాత రేంజర్ పట్టుబడ్డాడు. అయితే, ఇప్పుడు భారతదేశం దానికి బదులుగా పాకిస్తాన్ రేంజర్‌ను దానికి అప్పగించింది.
జవాన్ పూర్ణమ్ కుమార్ షా వివరాలు
బిఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణబ్ కుమార్ షా ఏప్రిల్ 23 నుండి పాకిస్తాన్ అదుపులో ఉన్నారు. ఇటీవలే పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఇండో-పంజాబ్ సరిహద్దులో విధుల్లో చేరిన షా, ఏప్రిల్ 23న జీరో లైన్ సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న సరిహద్దు గ్రామస్తులకు (రైతులు) సహాయం చేస్తుండగా అనుకోకుండా సరిహద్దు దాటాడు. పాకిస్తాన్ సరిహద్దు భద్రతా దళం అతన్ని పట్టుకుంది. ఇలాంటి సంఘటనలు గతంలోనూ జరగడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అవి సాధారణంగా ఫ్లాగ్ మీటింగ్‌లు, విదేశాంగ చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రస్తుతం అదే మాదిరి, విదేశాంగ చర్చల వల్లే ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కనిపించింది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నివాసి అయిన జవాన్ పికె సాహు ఏప్రిల్ 10 నుండి భారతదేశం-పంజాబ్ సరిహద్దులో ఒక తాత్కాలిక బృందంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అతను తన యూనిఫాం ధరించి విధుల్లో ఉండగా పొరపాటున సరిహద్దు దాటాడు. అయితే, సాహును అరెస్టు చేసిన సమయంలో, ఈ విషయం తెలిసిన భద్రతా అధికారులు మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయని, అవి సాధారణంగా ఫ్లాగ్ సమావేశాలు, పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించడం జరుగుతాయని, అదే పరిస్థితి మరోసారి కనిపించిందని చెప్పారు.

Read Also: Pakistan: పాక్ కుట్ర భయం జై శంకర్‌కు సెక్యూరిటీ పెంపు

Breaking News in Telugu BSF jawan from Pakistan Gharwapati for Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.