📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Gaza-తమ బందీలు విడుదలయ్యేవరకు యుద్ధమే: ఇశ్రాయెల్

Author Icon By Pooja
Updated: September 17, 2025 • 1:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న హమాస్, ఇశ్రాయేలు యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. యుద్ధంలో గాజా పట్టణం సర్వనాశనం అయ్యింది. ప్రజల జీవనవిధానం కడు దయనీయంగా ఉంది. ఆహారం కోసం అల్లాడుతున్నారు. కనీస అవసరాలకు కూడా నోచుకోవడం లేదు. తమ దేశబందీలను హమాస్ చెర నుంచి విడుదలయ్యేవరకు యుద్ధం కొనసాగుతుందని ఇశ్రాయెల్ మరోసారి స్పష్టం చేసింది. 

గాజా తగలబడుతోందని.. ఇజ్రాయెల్ దళాలు ఉగ్రవాదుల(Terrorists) స్థావరాలపై ఉక్కు పిడికిలితో విరుచుకుపడుతున్నాయని తెలిపింది. టార్గెట్ పూర్తయ్యే దాకా తాము దాడులు ఏమాత్రం ఆపేదిలేదని తేల్చిచెప్పింది. ఇంతవరకు ఈ దాడులు వైమానికం వరకే పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు ఐడీఎఫ్ సైన్యం నేరుగా మళ్లీ గాజాలోకి ప్రవేశించింది. భూతల దాడులు ప్రారంభించింది. ఇప్పటికే 3. 5 లక్షలమంది పాలస్తీనీయులను గాజా స్ట్రీప్ నుంచి తరలించామని ఐడిఎఫ్ పేర్కొంది. ఇంకా వేలాదిమంది మిగిలిపోయినట్లు చెప్పింది. ఇప్పుడు వారు కూడా నగరాన్ని విడిచి వెళుతున్నారు. మొత్తానికి గాజాను వల్లకాటి దిబ్బగా మార్చేవరకు ఇజ్రాయెల్ ఊరుకునేలా కనిపించడం లేదు.

ఈ మారణహోమం ఆగేదెప్పుడు?

గాజాలో ప్రధాన ఆపరేషన్ మొదలైందని ఇజ్రాయెల్ సైనికాధికారులు చెబుతున్నారు. నడిబొడ్డు నుంచి చివరి వరకూ తమ సైన్యాలు బలంగా కదులుతున్నాయని తెలిపారు. గాజాలో ఇప్పటివరకూ రెండువేల మంది హమాస్ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోందని.. అలాగే చాలా రహస్య సొరంగాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇవి మొత్తం నాశనం అయ్యేవరకూ వదిలేదే లేదని మరోసారి స్పష్టం చేశారు. అయితే దీనికి ఎన్ని రోజులు పడుతుంది.. తమ ఆపరేషన్ ను ఎప్పటి వరకు కొనసాగిస్తాం అనే వివరాలు మాత్రం వారు చెప్పడం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Netanyahu) ఇంటి వద్ద హమాస్ చెరలో ఇంకా బందీలుగా ఉన్నవారి కుటుంబాలు నిరసనలు చేశాయి. తమవారిని వెంటనే విడిపించాలని వారు డిమాండ్ చేశారు. హమాస్ చెరలో ఇంకా 20మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇశ్రాయెల్ ఎందుకు యుద్ధం కొనసాగిస్తోందని చెప్పింది?
హమాస్ వద్ద ఉన్న బందీలు విడుదలయ్యేవరకు యుద్ధం కొనసాగుతుందని చెప్పింది.

బందీల సమస్యపై ఇశ్రాయెల్ ఏమంటోంది?
బందీలను నిర్బంధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pakistan-trump-lied-pakistani-minister-ishaq-dar/international/548892/

Gaza war Google News in Telugu Hamas Hostage Crisis israel Israel Hamas Conflict Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.