📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Gaza: గాజాలో కేజీ చక్కెర రూ.7వేలు, లీటర్‌ పెట్రోల్‌ రూ.2 వేలు

Author Icon By Vanipushpa
Updated: July 12, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్‌(Israel) చేస్తున్న భీకర యుద్ధంతో ఆర్థికంగా కుదేలైన గాజా(Gaza)లో పరిస్థితులు మరింత దారుణంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆహారం, ఔషధాలు, ఇంధన కొరత ఎదుర్కొంటున్న పాలస్తీనియన్ల(Palestines)కు కరెన్సీ కష్టాలు తీవ్రంగా మారాయి. యుద్ధం నేపథ్యంలో అక్కడి బ్యాంకులు, ఏటీఎం(Banks and ATM)లు పనిచేయక పోవడంతో తాజా పరిస్థితి తలెత్తింది. రోజువారీ ఖర్చులకు అవసరమైన నగదు కోసం మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఐదు శాతం కమీషన్‌ తీసుకున్న దళారులు ఇప్పుడు ఏకంగా 40 శాతానికి పెంచేశారని, దీంతో నిత్యవసరాలు కొనేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పాలస్తీనా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భారీ నిరుద్యోగిత
సాధారణంగా గాజా వాసులు చాలా లావాదేవీలకు ఇజ్రాయెల్‌ కరెన్సీ షెకెల్‌ను వినియోగిస్తారు. కానీ, యుద్ధం నేపథ్యంలో పాలస్తీనియన్లకు నగదు సరఫరాను ఇజ్రాయెల్​ నిలిపి వేసింది. ఇలా ఓవైపు కొత్త కరెన్సీ నిలిచిపోగా, పాతవి, చిరిగిపోయిన, పాడైన నోట్లను వ్యాపారులు అనుమతించకపోవడం స్థానికులకు మరింత ఇబ్బందికరంగా మారింది.

Gaza: గాజాలో కేజీ చక్కెర రూ.7వేలు, లీటర్‌ పెట్రోల్‌ రూ.2 వేలు

షెకెల్స్‌ను డాలర్‌లోకి మార్చేందుకు భారీగా కమీషన్‌
హమాస్‌ ఆయుధాల కొనుగోలు సామర్థ్యాన్ని తగ్గించడంలో భాగంగా ఇజ్రాయెల్‌ గాజాలోకి నగదును నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో స్థానికంగా ఉండే సంపన్న కుటుంబాలు బ్యాంకుల నుంచి డబ్బులు ఉపసంహరించుకొని దేశం విడిచి వెళ్లిపోయారనే వాదన కూడా ఉంది. విదేశీ వ్యాపారులు కూడా వస్తువుల విక్రయాలకు నగదునే డిమాండ్‌ చేస్తుండటం కొరతకు కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుంటున్న బ్రోకర్లు, షెకెల్స్‌ను డాలర్‌లోకి మార్చేందుకు భారీగా కమీషన్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కేజీ చక్కెర రూ.7వేలు
‘‘రవాణాతోపాటు కూరగాయలు, ఆహారం, నీరు, ఔషధాలు ఇలా ఏది కొనాలన్నా నగదు అవసరమని,. దీని కోసం అన్నీ అమ్ముకోవాల్సి వస్తోందని అంటున్నారు. పిండి, ఆహారపదార్థాలు కొనేందుకు తన బంగారాన్నే అమ్మేశానని మెడికల్‌ షాప్ యజమాని షాహిద్‌ అజ్జూర్‌ వాపోయారు. యుద్ధంతో తన వ్యాపారమంతా నాశనమైందన్న ఆయన, ప్రస్తుతం కుటుంబ పోషణకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో రెండు రోజులకు నాలుగు డాలర్లు ఖర్చు కాగా తాజాగా, ఇప్పుడది 12 డాలర్లకు పెరిగిందని చెప్పారు. చక్కెర ధర భారీగా పెరిగిపోయిందని, యుద్ధానికి ముందు కిలో ధర 2 డాలర్లుగా ఉండగా ఇప్పుడది 80-100 డాలర్లు పలుకుతోందని మరో స్థానికుడు తెలిపాడు.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2024 చివర్లో గాజాలో 80 శాతం మంది నిరుద్యోగులే ఉండగా తాజాగా అది మరింత ఎక్కువైంది. గతేడాది అక్కడ ద్రవ్యోల్బణం 230 శాతం పెరిగింది. అయితే, ఈ ఏడాది జనవరిలో కాల్పుల విరమణతో అది స్వల్పంగా తగ్గినప్పటికీ, ఒప్పందం నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగడంతో మళ్లీ భారీగా పెరిగింది. మరోవైపు నగదు సంక్షోభం నుంచి బయటపడేందుకు చర్యలు చేపట్టిన పాలస్తీనా వాణిజ్య విభాగం, గతేడాది డిజిటల్‌ పేమెంట్స్‌ వ్యవస్థను తీసుకువచ్చింది .

గాజాకు ఆ పేరు ఎవరు పెట్టారు?
కనానీయులు బహుశా గాజా అనే పేరు పెట్టారు, పురాతన సెమిటిక్ భాషలలో దీని అర్థం “బలం”. ఈజిప్షియన్లు దీనిని “గజ్జత్” (బహుమతి పొందిన నగరం) అని పిలిచారు.
గాజా ఎందుకు ప్రసిద్ధి చెందింది?
గాజా | మ్యాప్, చరిత్ర, & వాస్తవాలు | బ్రిటానికా
గాజా చాలా కాలంగా ఇస్లామిక్ సంప్రదాయానికి ముఖ్యమైన కేంద్రంగా ఉంది మరియు ప్రవక్త ముత్తాత హాషిం ఇబ్న్ అబ్ద్ మనాఫ్ సమాధి చేయబడిన ప్రసిద్ధ ప్రదేశం ఇది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Radhika Yadav: మహిళా టెన్నిస్ ప్లేయర్‌ రాధికా యాదవ్ ని కాల్చి చంపిన తండ్రి..కారణమిదే?

Gaza Blockade Gaza crisis Gaza Economy Gaza War Impact Humanitarian Crisis Latest News Breaking News middle east conflict Petrol Price Gaza Sugar Price Gaza

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.